మహేష్ బాబు అన్న ఘట్టమనేని రమేష్ బాబు 2022 లో మరణించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆయన కూడా హీరోగా, నిర్మాతగా చేశారు. చివరి రోజుల్లో అనారోగ్యంపాలై మరణించారు. ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ కూడా మరణించడంతో.. రమేష్ బాబు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ మహేష్ బాబు తీసుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో మహేష్ అన్న కొడుకు, సూపర్ స్టార్ కృష్ణ పెద్ద మనవడు అయిన జయ కృష్ణని హీరోగా లాంచ్ చేయడానికి మహేష్ అండ్ ఫ్యామిలీ రెడీ అయ్యింది. కొన్నాళ్లుగా జయకృష్ణ నటనలో శిక్షణ తీసుకుంటూ వచ్చారు.
‘ఆర్.ఎక్స్.100’ ‘మంగళవారం’ చిత్రాల దర్శకుడు అజయ్ భూపతి జయకృష్ణని హీరోగా లాంచ్ చేయనున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా పూజా కార్యక్రమాలతో జయకృష్ణ కొత్త సినిమా ప్రారంభం కానుంది. సెప్టెంబర్ నుండి ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ‘పద్మాలయ స్టూడియోస్’ ‘వైజయంతీ మూవీస్’ ‘ఆనంది ఆర్ట్స్’ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాయి.
జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నారు. మహేష్ తో పాటు కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు కూడా జయకృష్ణ డెబ్యూ విషయంలో స్పెషల్ కేరింగ్ తీసుకుంటున్నట్టు సమాచారం. మరోపక్క జూ.ఎన్టీఆర్ పై కూడా అలాంటి బాధ్యతే ఉంది. హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్ మరణించిన తర్వాత అతని కుటుంబానికి… కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ పెద్ద దిక్కు అయ్యారు.
జానకిరామ్ కొడుకు నందమూరి తారక రామారావు కూడా హీరోగా డెబ్యూ ఇవ్వబోతున్నాడు.అతని డెబ్యూ మూవీకి వై.వి.ఎస్.చౌదరి దర్శకత్వం వహించనున్నారు. వై.వి.ఎస్. చౌదరి భార్య గీత ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. సో అటు ఎన్టీఆర్, ఇటు మహేష్ బాబు.. ఇద్దరిపై కూడా తమ అన్న కొడుకుల డెబ్యూ మూవీస్ కి మద్దతు ఇచ్చి హెల్ప్ చేయాల్సిన బాధ్యత ఎక్కువగా ఉంది అని చెప్పాలి.