మహేష్ బాబు- రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. దాదాపు రూ.800 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా ఇది. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, మాధవన్ వంటి స్టార్స్ అందరూ నటిస్తున్నారు. రాజమౌళి ఇప్పటివరకు తీసిన సినిమాలు వేరు. ఇది వేరు. మొదటిసారి మహేష్ బాబు ఇమేజ్ కి సూట్ అయ్యేలా ఓ అడ్వెంచర్ డ్రామా తీస్తున్నారు రాజమౌళి.
ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ పై రాని విధంగా ఇందులో విజువల్స్ ఉంటాయట. హాలీవుడ్ టెక్నిషియన్స్, మార్కెటింగ్ టీం ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. ఆల్రెడీ 2 షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. ఇటీవల 3వ షెడ్యూల్ మొదలైంది. కానీ నిన్న రాత్రి ఊహించని విధంగా కీరవాణి తండ్రి శివశక్తి దత్తా మరణించడంతో షూటింగ్ 2 రోజులు వాయిదా వేసినట్లు సమాచారం. శివశక్తి దత్తా రాజమౌళికి పెదనాన్న అవుతారనే సంగతి కూడా తెలిసిందే.
ఇదిలా ఉండగా.. శివ శక్తి దత్త సాహిత్యం సమకూర్చిన పాటలు అన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ‘ఛత్రపతి’ లో ‘అగ్ని స్కలన’, ‘బాహుబలి ది బిగినింగ్’ లో ‘మమతల తల్లి’ కావచ్చు, ‘బాహుబలి 2’ లో ‘సాహోరే బాహుబలి’ కావచ్చు, ‘ఆర్.ఆర్.ఆర్’ లో ‘రామం రాఘవం’ కావచ్చు, ‘హనుమాన్’ లో ‘అంజనాద్రి’ పాట కావచ్చు… ఇలా అన్నీ చార్ట్ బస్టర్సే.
ముఖ్యంగా ఆయన పాటల్లో మైథలాజి టచ్ ఉంటుంది. మహేష్ తో రాజమౌళి చేస్తున్న సినిమాలో కూడా మైథాలజీ టచ్ ఉంటుందట. అందుకే శివశక్తి దత్తాతో ఓ పాటని రాయించాలని.. దానిని థీమ్ సాంగ్ గా ప్రమోట్ చేసుకోవాలని రాజమౌళి భావించారట. కానీ ఇంతలోనే శివశక్తి దత్తా కన్నుమూశారు.