సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) , స్టార్ డైరెక్టర్ అలాగే మాటల మాంత్రికుడు అయినటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) .. కలయికలో ‘అతడు’ (Athadu) ‘ఖలేజా’ (Khaleja) వంటి చిత్రాల తర్వాత ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) అనే భారీ బడ్జెట్ సినిమా రూపొందింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ మహేష్ బాబుకి, త్రివిక్రమ్..కి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న ఇమేజ్, అలాగే సంక్రాంతి పండుగ సెలవులు కలిసొచ్చి ఈ మూవీ భారీ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది.
అక్కడితో అయిపోలేదు. ఊహించని విధంగా సంక్రాంతి సెలవులు ముగిశాక కూడా ఈ మూవీ స్టడీగా కలెక్ట్ చేసి రూ.110 కోట్ల షేర్ ను బాక్సాఫీస్ వద్ద కలెక్ట్ చేయడం విశేషం. టాలీవుడ్లో ఇప్పటివరకు ఏ హీరోకి సాధ్యం కాని ఫీట్ అది. మరోపక్క నెట్ ఫ్లిక్స్ లో(ఓటీటీలో) కూడా 2 వారాల పాటు నెంబర్ వన్ ప్లేస్ లో ట్రెండ్ అయ్యింది ‘గుంటూరు కారం’.
అలాగే టెలివిజన్ ప్రీమియర్ టెలికాస్ట్ అయినప్పుడు కూడా 9 కి పైగా టీఆర్పీ రేటింగ్ ను నమోదు చేసి పర్వాలేదు అనిపించింది. ఓటీటీల హవా పెరిగిపోయిన టైంలో కూడా టెలివిజన్ ప్రీమియర్ కి అంత టీఆర్పీ రేటింగ్ రావడం అంటే చిన్న విషయం కాదు. అలాగే 4 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన ఘనత కూడా ‘గుంటూరు కారం’ సొంతం. ఇది పక్కన పెడితే ఇప్పటికీ ‘గుంటూరు కారం’ హవా తగ్గలేదు అనే చెప్పాలి.
ఎందుకంటే నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 175 రోజులు పూర్తి కావస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడులోని చిలకలూరిపేటలో ఉన్న వెంకటేశ్వర అనే థియేటర్లో విజయవంతంగా 175 రోజులు(4 ఆటలుగా) ప్రదర్శింపబడింది ‘గుంటూరు కారం’ సినిమా. 93 ఏళ్ళ సినీ చరిత్రలో 28 చిత్రాలకి గాను 7 సిల్వర్ జూబ్లీ సినిమాలు కలిగి ఉన్న ఏకైక హీరోగా మహేష్ బాబు వరల్డ్ రికార్డుని సొంతం చేసుకోవడం విశేషంగా చెప్పుకోవాలి.