మహేష్ కూతురితో పాట పాడిస్తున్న దేవిశ్రీప్రసాద్
- March 12, 2019 / 01:34 PM ISTByFilmy Focus
మహేష్ బాబు కూతురు సితార గురించి తెలియనివారుండరు. చిన్న వయసులోనే తండ్రితో సమానమైన పాపులారిటీని సంపాదించుకున్న సితార.. తండ్రి అందం కూడా పుణికిపుచ్చుకొని క్యూటెస్ట్ బేబీగా అందరి మన్ననలు అందుకొంది. సితార చేసే చిన్ని చిన్ని పనులకి మహేష్ బాబు ఎంత ఆనందపడతాడో తెలియదు కానీ.. ఆయన అభిమానులు మాత్రం ఆ చిన్నారిని చూసుకుని తెగ మురిసిపోతారు. ఆమె మహేష్ బాబు సినిమాలో వెండితెరపై కనిపిస్తే బాగుండు అని ఎదురుచూసే అభిమానులు బోలెడుమంది.

- 118 రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- కెప్టెన్ మార్వెల్రి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- సర్వం తాళ మయం రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- విశ్వాసం రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

అయితే.. వెండితెర మీద కాదు కానీ తెర వెనుక సితార పాప మెరిసే అవకాశం ఉంది. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ రీసెంట్ గా సితార మరియు ఆమె ఫ్రెండ్ కు సంగీతం నేర్పిస్తున్న ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. సితార బేసిగ్గానే మంచి సింగర్.. ఇదివరకు తన తండ్రి కోసం ఒకసారి పాట పాడింది. ఆ పాట వైరల్ అయ్యింది కూడా. ఆ ఫోటోలు చూస్తున్న అభిమానులందరూ.. దేవిశ్రీప్రసాద్ సంగీత సారధ్యంలో సితార ఒక పాట పాడితే బాగుంటుంది అని అభిప్రాయాలూ వ్యక్తం చేస్తున్నారు.













