Mahesh Babu: వైరల్ అవుతున్న మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

  • September 1, 2022 / 04:35 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు ఘనవిజయం సాధించాయనే సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా మహేష్ నటిస్తున్న ప్రతి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు రికార్డు స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం. ఒకవైపు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా మహేష్ బాబు కుటుంబానికి కూడా తన వంతు ప్రాధాన్యత ఇస్తారనే సంగతి తెలిసిందే. అయితే తన కొడుకు గౌతమ్ బర్త్ డే సందర్భంగా మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్ చేయగా ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మహేష్ బాబు తన పోస్ట్ లో నా యంగ్ మ్యాన్ గౌతమ్ కు 16వ పుట్టినరోజు శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. గౌతమ్ నన్ను ప్రతిరోజూ గర్వపడేలా చేస్తున్నాడని మహేష్ బాబు చెప్పుకొచ్చారు. నువ్వు లైఫ్ లో ఉత్తమమైన వ్యక్తిగా ఎదిగే క్షణాల కొరకు ఆతృతగా ఎదురుచూస్తున్నానని గౌతమ్ గురించి మహేష్ బాబు కామెంట్లు చేశారు. లైఫ్ లోని ఈ కొత్త అంకంలో నీకంతా మంచే జరగాలని దీవిస్తున్నానని మహేష్ బాబు అన్నారు.

అవసరమున్న ప్రతిసారీ గౌతమ్ వెంటే ఉంటానని గౌతమ్ ఊహించిన దానికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానని లవ్ యూ అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు. మహేష్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సితార సైతం అన్నయ్య గౌతమ్ కు బర్త్ డే విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

సితార గౌతమ్ తో పలు సందర్బాలలో దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో పాటు గౌతమ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మహేష్ బాబు చేసిన ట్వీట్ కు రికార్డు స్థాయిలో లైక్స్ వస్తున్నాయి. త్వరలో త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాతో మహేష్ బాబు బిజీ కానున్నారు. 2023 సంవత్సరం ఏప్రిల్ 28వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus