రవితేజ హీరోగా నటించిన రావణాసుర చిత్రం ఈరోజు అంటే ఏప్రిల్ 7 న విడుదలైంది. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘అభిషేక్ పిక్చర్స్’ ‘ఆర్.టి.టీం వర్క్స్’ బ్యానర్ల పై అభిషేక్ నామా, రవితేజ కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి మొదటి షో నుండి మిక్స్డ్ టాక్ వస్తుంది. కొన్ని సన్నివేశాలు ఇంట్రెస్టింగ్ గా ఉన్నప్పటికీ రవితేజని అంత నెగిటివ్ గా చూడలేకపోయామని.. కొందరు అంటున్నారు. మరికొంతమంది అయితే ఈ సినిమాని తెలుగులో తీసే ఉద్దేశం ఉంటే..
ఎవరైనా చిన్న హీరో లేదా కొత్త హీరోతో చేస్తే బాగుండేది.. రవితేజ వంటి స్టార్ ఇలాంటి చిత్రం చేయడాన్ని అందరూ యాక్సెప్ట్ చేయలేరు అంటున్నారు. ఏదేమైనా రవితేజ గట్స్ కు మెచ్చుకోవాలి, తన పాత్రకి వందశాతం న్యాయం చేశాడు. ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో ‘ఆగడు’ సినిమా ప్రస్తావన తీసుకురావడం అందరినీ షాక్ కు గురిచేసింది. విషయంలోకి వెళితే.. ‘రావణాసుర’ లో ఓ సన్నివేశం ఉంటుంది. అందులో మేకప్ ఆర్టిస్ట్ పై టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం కేసు వేసినట్టు చెప్తారు.
ఓ సినిమాలో (Ravanasura) తాను నటించకపోయినా, తన అనుమతి లేకుండా డూప్ తో తన పాత్రను పూర్తిచేసినందుకు బ్రహ్మానందం కేసు వేసినట్టు చూపించారు. అప్పుడు ‘ఆగడు’ సినిమా క్లైమాక్స్ లో బ్రహ్మానందం … ‘రేసుగుర్రం’ ‘యమదొంగ’ ‘రచ్చ’ వంటి సినిమాల్లోని పాటలకు డాన్స్ లు వేసిన వీడియోని చూపిస్తారు. ‘ఆగడు’ సినిమాని మహేష్ మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నాడు, పైగా శ్రీనువైట్లని అయితే జనాలు మర్చిపోయారు కూడా.. ఇలాంటి టైంలో ఆ సినిమా ప్రస్తావన ‘రావణాసుర’ లో రావడం మహేష్ అభిమానులను కూడా ఇరిటేట్ చేస్తుందని చెప్పొచ్చు.
హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?