చైతు సినిమాపై మహేష్ ఫ్యాన్స్ స్పెషల్ ఫోకస్!

అక్కినేని నాగచైతన్య, విక్రమ్ కె కుమార్ కాంబినేషన్ లో ‘థాంక్యూ’ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఉన్నట్టుండి ఈ సినిమా పేరుని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. కానీ అలా చేస్తున్నది అక్కినేని ఫ్యాన్స్ కాదండీ.. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్. అసలు విషయంలోకి వస్తే.. ‘థాంక్యూ’ సినిమాలో చైతు.. మహేష్ బాబుకి వీరాభిమానిగా నటిస్తున్నాడు. టీనేజ్ లో అందరి కుర్రాళ్ల మాదిరి అభిమాన హీరో కోసం పడి చచ్చే క్యారెక్టర్ లో చైతు కనిపించనున్నాడు.

మహేష్ బాబుకి సూపర్ స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన ‘ఒక్కడు’ సినిమా రిలీజ్ సమయంలో హడావిడి చేసే అభిమానిగా చైతు ఈ సినిమాకి కనిపిస్తాడట. దీనికోసం గడ్డం, మీసం తీసేసి చిన్న కుర్రాడిలా మారిపోయాడు చైతు. ఈ లుక్ తోనే తాజాగా చైతుపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక థియేటర్ ముందు మహేష్ బాబు భారీ కటౌట్ పెట్టి.. దాన్ని చైతూతో ఆవిష్కరించే సన్నివేశాలను చిత్రీకరించారు.

కటౌట్ పైకి చైతు నిచ్చెన ద్వారా వెళ్లడం, పైన తెరను తీసి మహేష్ కటౌట్ ఆవిష్కరించి విజిల్స్ వేసి.. సంబరాలు చేసుకోవడం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియో, ఫోటోలు చూసిన మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ‘థాంక్యూ’ సినిమాని ట్రెండ్ చేస్తున్నాయి. ‘ఒక్కడు’ సినిమా రోజులను గుర్తు చేసుకుంటూ ఖుషీ అవుతున్నారు.


Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus