పవన్ కళ్యాణ్ మాటకు మహేష్ కట్టుబడటం ఏంటి.. అసలు మహేష్ కు పవన్ ఏ మాట చెప్పాడు… ? పైన ఉన్న హెడ్డింగ్ చూసాక అందరిమైండ్లోనూ ఇవే డౌట్ లు వస్తుంటాయి. పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ సినిమాలో ఓ పాపులర్ డైలాగ్ ఉంటుంది. ‘ఎక్కడ నెగ్గాలో కాదురా.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు గొప్పోడు’ అని..! ఇప్పుడు ఈ డైలాగ్ తోనే మహేష్ బాబు పై బయ్యర్స్ అంతా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. విషయం ఏమిటంటే.. బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న ‘అల వైకుంఠపురములో’ అలాగే మహేష్, అనిల్ రావిపూడిల ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాలని 2020 సంక్రాంతి కానుకగా జనవరి 12 నే విడుదల చేస్తున్నట్టు ప్రకటించి డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద షాక్ ఇచ్చారు.
మొదట ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని జనవరి 12 కే విడుదల చేయబోతున్నట్టు ముందు నుండీ డిస్కషన్లు మొదలయ్యాయి. 2019 సంక్రాంతికి వచ్చిన అనిల్ రావిపూడి చిత్రం ‘ఎఫ్2’ ను కూడా అదే డేట్ కు రిలీజ్ చేశారు కాబట్టి.. మళ్ళీ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని కూడా అదే డేట్ విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ అనుకోకుండా ‘అల వైకుంఠపురములో’ చిత్రాన్ని కూడా అదే డేట్ కు అనౌన్స్ చేశారు. ఇక్కడే వచ్చింది అసలు సమస్య. చివరికి రెండు సినిమాల నిర్మాతలు అయిన రాధాకృష్ణ, అల్లు అరవింద్, దిల్ రాజు, అనిల్ సుంకర మీటింగ్ ఏర్పాటు చేసుకుని… ఈ విషయం పై రాజీకి వచ్చే ప్రయత్నం చేశారు. దీంతో మహేష్ కూడా డిస్ట్రిబ్యూటర్స్ ను దృష్టిలో పెట్టుకుని ఒక రోజు ముందుకు రావడమే కరెక్ట్ అని నిర్మాతలకు ఫోన్ చేసి చెప్పడంతో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని ఒక రోజు ముందు అంటే .. జనవరి 11 న విడుదల చేయడానికి ఫిక్స్ అయ్యారని తెలుస్తుంది. అందుకే పవన్ మాటకు మహేష్ కట్టుబడి ఉన్నాడని బయ్యర్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.