Mahesh Babu: హరిద్వార్‌లో తన తల్లి అస్థికలు నిమజ్జనం చేసిన మహేష్ బాబు.. వైరలవుతున్న ఫోటోలు..!

ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి. రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు మృతితో ఒక్కసారిగా ఇండస్ట్రీ షాక్ కు గురైంది. ఆ షాక్ నుండి ఇంకా తేరుకోకముందే మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి కన్నుమూశారు.అనారోగ్య కారణాలతో ఆమె ఏ ఐ జి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించింది.దీంతో ఘట్టమనేని కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసినట్లు అయ్యింది. ఇక మహేష్‌ బాబు తన తల్లి పై ఉన్న ప్రేమను, భక్తిని చాలా సందర్భాల్లో బయటపెట్టాడు.

‘మా అమ్మ చేతి కాఫీ నాకు ఓ ప్రసాదంతో సమానం’ అంటూ మహేష్ బాబు తెలిపిన సంగతి తెలిసిందే. అలాంటి తల్లి దూరమవడంతో మహేష్ బాబు చాలా డిజప్పాయింట్ అయ్యాడు. ఇక పోయిన వారి అస్థికలను గంగలో కలిపితే.. వారు బతికుండగా చేసిన పొరపాట్లు క్షమించబడతాయి, వారి ఆత్మకు కూడా శాంతి కలుగుతుంది అనే నమ్మకం ఇండియాలో ఎక్కువ. మహేష్‌ బాబు కూడా తన తల్లి ఇందిరా దేవి అస్థికలను గంగలో కలపడం కోసం హరిద్వార్‌ వెళ్లాడు.

ఆదివారం అనగా అక్టోబర్ 2న తమ ఇంటి వద్ద చిన్న కర్మ అయిపోగానే.. హరిద్వార్‌ వెళ్లాడు. బేగంపేట నుండి ప్రత్యేక ఎయిర్‌క్రాఫ్ట్‌లో హరిద్వార్‌ వెళ్లిన మహేష్..అక్కడ ఇందిరా దేవి అస్థికలు గంగలో నిమజ్జనం చేశాడు. మహేష్‌ బాబు తో పాటు అతని బాబాయ్‌ ఆదిశేషగిరిరావు, జయదేవ్‌, సుధీర్‌ బాబు వంటి వారు వెళ్లినట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus