Mahesh Babu: దేవుడి పాత్రలో మహేష్ అనేది పబ్లిసిటీ స్టంట్ మాత్రమే!
- October 29, 2024 / 06:13 PM ISTByFilmy Focus
గత రెండు రోజులుగా మహేష్ బాబు (Mahesh Babu) ఓ సినిమాలో కృష్ణుడి పాత్రలో నటిస్తున్నాడంటూ ఓ గాసిప్ తెగ హల్ చల్ చేసింది. గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ (Ahok Galla) హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం “దేవకీ నందన వాసుదేవ”(Devaki Nandana Vasudeva). ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కథ అందించిన ఈ చిత్రానికి “గుణ 369” ఫేమ్ అర్జున్ జంధ్యాల (Arun Jandyala) దర్శకత్వం వహిస్తున్నాడు. నవంబర్ 14న “కంగువ (Kanguva) , మట్కా(Matka)” సినిమాతోపాటుగా విడుదలవుతున్న ఈ చిత్రం గత రెండు రోజులుగా మహేష్ బాబు పుణ్యమా అని సోషల్ మీడియా మొత్తం ట్రెండ్ అయ్యింది.
Mahesh Babu

ఈ సినిమాలో కృష్ణుడిది ఓ కీలకపాత్ర ఉంది. ఈమధ్య మైథాలజీకల్ రిఫరెన్సులు సినిమాల్లో కామన్ అయిపోయాయి కాబట్టి.. ఆ కృష్ణుడి పాత్రలో మహేష్ బాబు కనిపించనున్నారని ఓ గాసిప్పు హడావుడి చేసింది. అయితే.. ఆల్రెడీ సినిమా షూటింగ్ అయిపోయిందని, మహేష్ బాబు సినిమాలో కనిపించే అవకాశం ఏమీ లేదని స్వయాన సినిమా బృందం కన్ఫర్మేషన్ ఇచ్చారు. సో, “దేవకీ నందన వాసుదేవ” సినిమాలో మహేష్ బాబు కృష్ణుడిగా కనిపించనున్నాడని వార్తలో ఏమాత్రం వాస్తవం లేదు.

కాకపోతే.. ఈవార్త పుణ్యమా అని నవంబర్ 14న ఈ సినిమా విడుదలవుతుంది అని ఇప్పటివరకు రాని అటెన్షన్ మొత్తం ఒక్కసారిగా సినిమాకి వచ్చింది. మరి ఈ పబ్లిసిటీని సినిమా ఏమేరకు వినియోగించుకుంటుందో చూడాలి. అశోక్ గల్లా సరసన మానస వారణాసి నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

దాదాపు 15 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సాధిస్తే తప్ప పెట్టిన మొత్తం రాబట్టడం కాస్త కష్టం అనే చెప్పాలి. అయితే.. ప్రశాంత్ వర్మ బ్రాండ్ ఈ సినిమాకి ఇప్పుడు మెయిన్ ఎసెట్.
















