దాదాపుగా ఏడాది క్రితం ఇదే సమయంలో మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది. అయితే వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ అంతకంతకూ ఆలస్యమవుతూ ఉండగా జూన్ నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. అయితే ఈ సినిమాలో మహేష్ తండ్రి పాత్రలో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ నటిస్తున్నారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. మహేష్ బాబు అభిమానులు సైతం వైరల్ అయిన వార్తల్లో నిజం ఉండవచ్చని భావించారు.
అయితే ఈ సినిమా మేకర్స్ మాత్రం వైరల్ అవుతున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని ఈ వార్తలను నమ్మవద్దని చెబుతున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుండగా మహేష్ కు జోడీగా ఈ సినిమాలో పూజా హెగ్డే నటిస్తున్నారు. వాస్తవానికి మహేష్ త్రివిక్రమ్ మూవీలో ముఖ్యమైన పాత్ర ఒకటి ఉంది. అయితే ఆ పాత్ర మహేష్ కు ధీటుగా ఉండే పాత్ర అని యంగ్ జనరేషన్ నటుడు ఆ పాత్రలో కనిపిస్తారని బోగట్టా.
మహేష్ త్రివిక్రమ్ మూవీ అంతకంతకూ ఆలస్యమవుతూ ఉండటంతో ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త ప్రచారంలోకి వస్తోంది. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కనుందో లేదో క్లారిటీ రావాల్సి ఉంది. వరుస విజయాలతో జోరుమీదున్న మహేష్ తర్వాత సినిమాల ఫలితాల విషయంలో కూడా కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. మహేష్ సినిమాల బడ్జెట్ కూడా అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. ఒక్కో సినిమాకు మహేష్ బాబు 50 కోట్ల రూపాయల నుంచి 60 కోట్ల రూపాయల స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు.
రాజమౌళి సినిమాతో మహేష్ బాబు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సాధించాలని భావిస్తున్నారు. రాజమౌళి మహేష్ బాబును ఏ విధంగా చూపిస్తారో అని అభిమానుల మధ్య కూడా జోరుగా చర్చ జరుగుతోంది.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!