Charith Maanas Birthday Celebrations: మహేష్ మేనల్లుడు చరిత్ మానస్ పుట్టినరోజు వేడుకలు.. వైరల్ అవుతున్న వీడియో !
- November 22, 2024 / 08:25 PM ISTByFilmy Focus
ఘట్టమనేని కుటుంబ సభ్యులంతా మళ్ళీ ఒకచోట చేరారు. మొన్నటికి మొన్న దివంగత సూపర్ స్టార్ కృష్ణ (Krishna) రెండో కుమార్తె మంజుల ఘట్టమనేని పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు అంతా కలిసి ఆమె పుట్టినరోజుని సెలబ్రేట్ చేసిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందులో మహేష్ బాబు (Mahesh Babu) కూడా ఉండటంతో.. అభిమానులను విపరీతంగా ఆ ఫోటోలు షేర్ చేశారు. అలాగే ఆ ఫోటోలను మంజుల (Manjula) షేర్ చేసి..
Charith Maanas Birthday Celebrations:

పుట్టినరోజు సెలబ్రేషన్స్ మూడ్ నుండి ఇంకా బయటకు రాలేకపోతున్నట్టు చెప్పుకొచ్చింది. ఆమె పోస్ట్ కి నమ్రత కూడా ‘ఇలాంటి పుట్టినరోజులు నువ్వు మరెన్నో జరుపుకోవాలి వదిన’ అంటూ కామెంట్స్ పెట్టడం కూడా హాట్ టాపిక్ అయ్యింది. ఇక ఇప్పుడు సుధీర్ బాబు (Sudheer Babu) కొడుకు పుట్టినరోజుని కూడా దగ్గరుండి సెలబ్రేట్ చేశారు ఘట్టమేని కుటుంబ సభ్యులు. అయితే ఈసారి మహేష్ బాబు మిస్ అయ్యాడు. కానీ నమ్రత (Namrata Shirodkar) హాజరైంది.
ఇక కొడుకు చరిత్ మానస్ (Charith Maanas) పుట్టినరోజు సెలబ్రేషన్స్ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు సుధీర్ బాబు. ‘నిన్ను నేను ఎంతగా ప్రేమిస్తున్నానో మాటల్లో చెప్పలేను, కానీ నీ స్వయంకృషితో నువ్వు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశిస్తున్నాను. హ్యాపీ బర్త్ డే చెర్రీ’ అంటూ రాసుకొచ్చాడు. ఇక ఈ వీడియోలో సుధీర్ బాబు భార్యతో పాటు.. అతని చిన్న కొడుకు మంజుల భర్త సంజయ్ స్వరూప్ వంటి వారు పాల్గొన్నారు. ఆ వీడియోని మీరు కూడా ఓ లుక్కేయండి :
On your special day, I want you to know how much I love and cherish you. You’re growing up to be an incredible individual! Happy birthday, cherry ❤️ @Just_Charith pic.twitter.com/7HGrRdno55
— Sudheer Babu (@isudheerbabu) November 22, 2024
















