Mahesh Babu: మహేష్‌ కొత్త ఫొటోకి అర్థం అదేనా? ఇంకేమైనా ఉందా?

అందం మీద, లుక్స్‌ మీద మహేష్‌బాబు ఎంతగా దృష్టిపెడతాడో.. ఫిట్‌నెస్‌ మీద అంతే దృష్టి పెడతాడు. అందుకే ఇప్పటికీ మహేష్‌ అంటే ఆ లుక్‌, ఫీల్‌ కలుగుతుంది. రాజకుమారుడు అని ఏ ముహూర్తాన పేరు పెట్టారో కానీ.. ఇంత వయసు వచ్చినా ఇంకా రాజకుమారుడిలానే కనిపిస్తున్నాడు. అయితే ఆ రాజకుమారుడు సూపర్‌ స్టార్‌ అయిపోయినా.. ఇంకా అమ్మాయిలకు కలల రాకుమారుడిగా ఎలా కనిపిస్తున్నాడో, కుర్రాళ్లకు ఆ ఫిట్‌నెస్‌ లెవల్స్‌తో ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తున్నాడు.

తాజాగా మహేష్‌బాబు ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ పోస్టు ఇప్పుడు కుర్రాళ్లకు మరింత మోటివేషన్‌గా నిలిచింది. అమ్మాయిలకు అంటారా క్రష్‌ను ఇంకాస్త పెంచింది అని చెప్పొచ్చు. కండల తిరిగి శరీరం, జిమ్‌లో కష్టించి పెంచిన బాడీ చూపిస్తూ మహేష్‌ ఓ పొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ఆ ఫొటో కింద కామెంట్స్‌ చూస్తే మహేష్‌కి మరింత ఊపు వచ్చి మరో పదేళ్లు కూడా ఇదే లుక్‌ను మెయింటైన్‌ చేయడానికి కష్టపడతాడు అనిపిస్తోంది. కుర్రాళ్లకు, అమ్మాయిలకు మరింత మజానిస్తాడు అని కూడా అనిపిస్తోంది.

ఆ విషయాలు పక్కపెడితే.. ఇప్పుడు మళ్లీ జిమ్‌కు వచ్చి బీస్ట్‌ లుక్‌లోకి మారడానికి కొత్త సినిమా కథ ఓకే అవ్వడమే కారణం అని అంటున్నారు. అంటే త్రివిక్రమ్‌తో మహేష్‌బాబు చేస్తున్న సినిమాకు కథ మారింది, మారుతుంది అంటూ గత కొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే ఎక్కడా అధికారిక సమాచారం లేదు. ఇప్పుడు మహేష్‌ తిరిగి జిమ్‌కి వచ్చాడు, ఆ లుక్‌ ఫొటోలు బయటకు వదిలాడు అంటే..

కచ్చితంగా సినిమా కథ ఓకే అయిపోయి ఉండొచ్చు అంటున్నారు. మరి ఏది నిజమో తెలియాలి. హారిక హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై మహేష్‌ 28వ సినిమా మొదలవ్వాలి. ఆ మధ్య ఓ షెడ్యూల్‌ షూటింగ్‌ అయినా ఆ తర్వాత ఆపేశారు. ఇప్పుడు ఆ సినిమా మళ్లీ మొదలుపెట్టాలి. సంక్రాంతి తర్వాత అన్నారు, ఫిబ్రవరి అన్నారు ఆ తర్వాత మార్చి అన్నారు. ఇప్పుడు ఆఖరిగా చెప్పిన మాట నిజమవుతుంది అంటున్నారు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus