గత కొద్ది రోజులుగా ‘చిరు 152’ అయిన ‘ఆచార్య'(వర్కింగ్ టైటిల్) చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం మహేష్ బాబుని తీసుకోబోతున్నారు అనే డిస్కషన్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నటించడానికి మహేష్ బాబు కూడా ఓకే చెప్పారని కూడా టాక్ నడిచింది. దర్శకుడు కొరటాల శివ కూడా మహేష్ కోసం స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేస్తున్నారంటూ వచ్చిన వార్తలు పెద్ద టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి. నిజానికి ఈ పాత్రకి మొదట చరణ్ ను అనుకున్నారు. కానీ రాజమౌళి తెరకెక్కిస్తోన్న ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలో కూడా చరణ్ హీరోగా నటిస్తుండడం.. ఆ చిత్రం షూటింగ్ కూడా కంప్లీట్ అవ్వకపోవడంతో చరణ్ చేయడం కుదరని పరిస్థితి. ఒకవేళ చరణ్ కోసం వెయిట్ చేస్తే.. ‘ఆచార్య’ చిత్రం 2020 విడుదలయ్యే పరిస్థితి లేదట.
అందుకే కొరటాల, చరణ్ లు.. మహేష్ ను అనుకున్నారు. ఈ చిత్రంలో మహేష్ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ… ఆయన రెమ్యూనరేషన్ అలాగే మిగిలిన బడ్జెట్ 40 కోట్లకు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇందుకు చిరు అంగీకరించడం లేదట. ‘చరణ్ తో సినిమా చేసే అవకాశం మళ్ళీ వస్తుందో లేదో.. అందులోనూ ఇంత బడ్జెట్ పెట్టడం ఎందుకు అని’.. చరణ్ నే ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. అయితే మహేష్ కోసం 40 కోట్లు అదనంగా పెట్టినా.. బిజినెస్ 80 కోట్లు ఎక్కువకు జరిగే అవకాశం కూడా ఉంటుంది. అలాంటప్పుడు చిరు ఎందుకు బడ్జెట్ పెట్టడానికి భయపడుతున్నారు అనేది పెద్ద చర్చనీయాంశం అవుతుంది. ఇక చరణ్ నటిస్తున్నాడు అని ఫైనల్ చేసేసారు కాబట్టి.. ‘ఆచార్య’ ఈ ఏడాది విడుదలవుతుందా లేదా అన్నది మరో అనుమానం. వీటికి చిత్ర యూనిట్ సభ్యులు నేరుగా స్పందిస్తేనే కానీ క్లారిటీ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు..!