ఆ టార్గెట్ ను మహేష్ జక్కన్న మూవీ అందుకుంటుందా?

  • March 15, 2023 / 03:30 PM IST

మహేష్ రాజమౌళి కాంబో మూవీపై ఆకాశమే హద్దుగా అంచనాలు ఏర్పడ్డాయనే సంగతి తెలిసిందే. బాహుబలి, బాహుబలి2, ఆర్.ఆర్.ఆర్ సినిమాల తర్వాత తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమా చరిత్ర సృష్టించనుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహేష్ జక్కన్న కాంబో మూవీ టార్గెట్ 4000 కోట్ల రూపాయలు అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. ఈ సినిమా విడుదల కావడానికి మరో మూడేళ్ల సమయం పడుతుంది. ఆ సమయానికి టికెట్ రేట్లు సైతం భారీగా పెరుగుతాయనే సంగతి తెలిసిందే.

జక్కన్న సినిమాల హక్కులకు ఊహించని స్థాయిలో డిమాండ్ నెలకొంది. మహేష్ జక్కన్న కాంబో మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేయడంతో పాటు రాజమౌళి గత సినిమాలను మించి ఈ సినిమా కలెక్షన్లను సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. జక్కన్న గత సినిమాలను సైతం విదేశీ భాషల్లో డబ్ చేయాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. మహేష్ బాబు రాజమౌళి సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సినిమాతో తన మార్కెట్ 10 రెట్లు పెరుగుతుందని మహేష్ ఫీలవుతున్నారని బోగట్టా.

మహేష్ రాజమౌళి కాంబో మూవీలో హీరోయిన్ గా నటించే అవకాశం కోసం చాలామంది హీరోయిన్లు ప్రయత్నిస్తున్నారని సమాచారం అందుతోంది. మహేష్ జక్కన్న కాంబో మూవీకి సంబంధించిన అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్ ఈ సినిమా కోసం తొలిసారి 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను సొంతం చేసుకుంటున్నారు. మహేష్ బాబు ఈ సినిమాతోనే పాన్ ఇండియా హీరోగా కెరీర్ ను మొదలుపెట్టనున్నారు.

ఈ సినిమాలో మహేష్ సాహసికుడి పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనులు జరుగుతుండటంతో పాటు లొకేషన్లు ఫైనల్ అవుతున్నాయి. మహేష్ రాజమౌళి కాంబో మూవీకి సంబంధించిన కొత్త అప్ డేట్స్ ను త్వరలో వెల్లడించనున్నారని తెలుస్తోంది. రాజమౌళి మహేష్ కు కెరీర్ బెస్ట్ హిట్ ఇవ్వాలని ఫ్యాన్స్ మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus