Mahesh Babu, Rajamouli: మహేష్ రాజమౌళి మూవీ బడ్జెట్ తగ్గిందా?

రాజమౌళి డైరెక్షన్ లో సినిమా తెరకెక్కితే ఆ సినిమా ప్రేక్షకుల అంచనాలను మించి ఉంటుందనే సంగతి తెలిసిందే. బాహుబలి1, బాహుబలి2, ఆర్ఆర్ఆర్ సినిమాలతో భారీ విజయాలను ఖాతాలో వేసుకున్న రాజమౌళి మహేష్ సినిమాతో ఈ సినిమాలను మించిన సక్సెస్ ను సొంతం చేసుకోవాలని అనుకుంటున్నారు. అయితే ఈ సినిమా బడ్జెట్ 800 కోట్ల రూపాయలుగా ఉండవచ్చని ప్రచారం జరగగా ఆ వార్తల్లో నిజం లేదని క్లారిటీ వచ్చింది. అయితే మరీ భారీ బడ్జెట్ తో సినిమాను తెరకెక్కించడం రిస్క్ అని భావిస్తున్న రాజమౌళి మహేష్ సినిమాను కేవలం 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించనున్నారని తెలుస్తోంది.

Click Here To Watch NOW

ఈ సినిమాను 2024 సంవత్సరంలో విడుదలయ్యే విధంగా జక్కన్న ప్లాన్ చేస్తున్నారు. రాజమౌళి మహేష్ ను సినిమాలో రా ఏజెంట్ గా చూపించబోతున్నారని సమాచారం అందుతోంది. టైమ్ ట్రావెల్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాను పూర్తి చేసిన తర్వాత మహేష్ బాబు ఈ సినిమాతో బిజీ కానున్నారని సమాచారం అందుతోంది. త్రివిక్రమ్ మూవీ పూర్తైతే మాత్రమే మహేష్ బాబు రాజమౌళి సినిమాకు డేట్లు కేటాయించే అవకాశం అయితే ఉంది.

మహేష్ కెరీర్ ప్లానింగ్ అద్భుతంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ అందిస్తున్నారు. మహేష్ బాబుకు రాజమౌళి సినిమాతోనే పాన్ ఇండియా హీరోగా గుర్తింపు దక్కిందని తెలుస్తోంది. రాజమౌళి సినిమాలో మహేష్ బాబు పాత్ర వైవిధ్యంతో ఉంటుందని సమాచారం అందుతోంది. మహేష్ బాబు ఈ సినిమా కోసం భారీగా రెమ్యునరేషన్ ను తీసుకోనున్నారని తెలుస్తోంది.

ఆర్ఆర్ఆర్ విషయంలో కొన్ని విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో రాజమౌళి తర్వాత సినిమాల విషయంలో ఆ పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడతారేమో చూడాల్సి ఉంది. మహేష్ రాజమౌళి పారితోషికాల కోసమే 150 కోట్ల రూపాయల వరకు ఖర్చు కానుందని తెలుస్తోంది.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus