Rajamouli,Mahesh Babu: మహేష్‌బాబు – జక్కన్న సినిమా కథ ఓకే చేయాలట!

‘ఆర్ఆర్‌ఆర్‌’ తర్వాత రాజమౌళి చేయబోయే సినిమా కచ్చితంగా మహేష్‌బాబుతోనే. ఈ మాట ఎవరూ కాదనరు. ఎందుకంటే ఇటీవల కాంలో చాలా సందర్భాల్లో రాజమౌళి, విజయేంద్రప్రసాద్‌ చెప్పారు. అయితే సినిమా కథేంటి, ఎలా ఉండబోతోంది, మహేష్‌ బాబును రాజమౌళి ఎలా చూపించబోతున్నారు.. ఈ ప్రశ్నలే వినిపిస్తున్నాయి. దీనికి గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న సమాధానాలు రెండు రకాల సినిమాలు. దీంతో చిన్నపాటి కన్‌ఫ్యూజన్‌ వస్తోంది. అయితే ఇప్పటివరకు వినిపిస్తున్న పుకార్లు నిజమేనట. అవును, ఈ విషయం రాజమౌళినే చెప్పారు.

మహేష్‌బాబుతో చేస్తున్న సినిమా సంగతులు చెప్పండి జక్కన్నా అంటే… రెండు కథలు సిద్ధంగా ఉన్నాయి, మరోసారి కూర్చుని కథను ఫైనలైజ్‌ చేయాలి అని చెప్పారు. అయితే ఆ రెండు కథలు ఏంటి అనే విషయం మాత్రం ఆయన చెప్పలేదు. కేవలం రెండు కథలు ఉన్నాయని మాత్రం వెల్లడించారు. త్వరలో మహేష్‌బాబుతో మరోసారి కూర్చుని కథ విషయంలో క్లారిటీ తీసేసుకుంటాం అని చెప్పారు జక్కన్న. అయితే పుకార్ల ప్రకారం చూసుకుంటే అనుకున్న సినిమా కథలు ఒక అడవి నేపథ్యంలో సినిమా, రెండోది జేమ్స్‌ బాండ్‌ స్టైల్‌ సినిమా.

నిజానికి మహేష్‌ – రాజమౌళి సినిమా అనౌన్స్‌మెంట్‌ వచ్చినప్పటి నుండి ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌ సినిమా అనే చెబుతున్నారు. దీనికి సంబంధించి ఓ ఆంగ్ల నవల హక్కులు కూడా తీసుకున్నారని చెప్పారు. అయితే ఇటీవల కాలంలో (‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదలైన తర్వాత) కొత్త టాక్‌ మొదలైంది. జేమ్స్‌ బాండ్‌ స్టైల్‌ సినిమాగా రాజమౌళి – మహేష్‌ సినిమా కథ ఉండబోతోందని అంటున్నారు. మహేష్‌ను అలా చూడాలనుకున్న ఫ్యాన్స్‌ ముచ్చట తీర్చేస్తారు అని కూడా అంటున్నారు.

దీంతో అభిమానుల్లో కన్‌ఫ్యూజ్‌ మొదలైంది. ఈ సమయంలో రాజమౌళి కూడా… ఇలా రెండు కథలు ఉన్నాయి, ఒకటి ఫైనలైజ్‌ చేయాలి అనడంతో కన్‌ఫ్యూజ్‌ కంటిన్యూ అవుతుంది. ఈ సినిమాకు రూ. 800 కోట్ల బడ్జెట్‌ అంటున్నారు. ఇదెంతవరకు నిజమో కానీ, పెడితే వండరే అని చెప్పాలి. ఇక్కడో విషయం, సినిమా మొదలయ్యాక రాజమౌళి ప్రెస్‌ మీట్‌ పెట్టి కథ, కాన్సెప్ట్‌ చెప్పేస్తారు. కాబట్టి అప్పటివరకు వెయిట్‌ చేయాల్సిందే.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus