Mahesh Babu: ఆ మూడు ఫ్లాట్ ఫామ్స్ లో మహేష్ సూపర్ రికార్డును సెట్ చేశారా?

  • March 25, 2023 / 01:54 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాతో బిజీగా ఉండగా ఈ సినిమా షూట్ శరవేగంగా జరుగుతోంది. ఆగష్టు నెల 11వ తేదీన ఈ సినిమా రిలీజవుతుందని ప్రకటించినా ఆ సమయానికి ఈ సినిమా విడుదల కావడం సులువైతే కాదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అయితే సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో మహేష్ బాబు సూపర్ రికార్డ్ ను సెట్ చేయగా ఆ రికార్డ్ హాట్ టాపిక్ అవుతోంది.

ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ లో వేర్వేరుగా మహేష్ బాబుకు 10 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఇలా మూడు వేర్వేరు ఫ్లాట్ ఫామ్స్ లో 10 మిలియన్ ఫాలోవర్లు ఉన్న ఏకైన హీరో మహేష్ కావడం గమనార్హం. సౌత్ ఇండియాలో ఈ రికార్డ్ మహేష్ కు మాత్రమే సొంతం కావడంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. మహేష్ రాజమౌళి కాంబో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. మహేష్ జక్కన్న కాంబో మూవీ వచ్చే ఏడాది మొదలుకానుంది.

ఈ సినిమా కోసం మహేష్ ప్రత్యేక శిక్షణ తీసుకోవాల్సి ఉంటుందని వినిపిస్తుండగా ఈ వార్తలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. మహేష్ జక్కన్న కాంబో మూవీ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కనుందని తెలుస్తోంది. జక్కన్న గత సినిమాలకు రెట్టింపు బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. సోషల్ మీడియాలో మహేష్ యాక్టివ్ గా ఉండటం వల్లే మహేష్ అరుదైన రికార్డులను సొంతం చేసుకుంటున్నారని ఫ్యాన్స్ చెబుతున్నారు.

రాజమౌళి సినిమాతో మహేష్ కూడా 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే సెలబ్రిటీల జాబితాలో చేరనున్నారు. మహేష్ తో పని చేయడానికి ఇతర భాషల ప్రముఖ దర్శకులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. సినిమా సినిమాకు మహేష్ మార్కెట్ పెరుగుతోంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus