‘చావా’ (Chhaava) చిత్రం సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. విక్కీ కౌశల్ (Vicky Kaushal) హీరోగా నటించిన ఈ సినిమాలో రష్మిక మందన (Rashmika Mandanna) హీరోయిన్ గా నటించింది. ఫిబ్రవరి 14న ఈ సినిమా వాలెంటైన్స్ డే కానుకగా రిలీజ్ అయ్యింది. లక్ష్మణ్ ఉటేకర్ (Laxman Utekar) దర్శకత్వం వహించిన ఈ సినిమా మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా భారీ వసూళ్లు సాధించాయి. ఛత్రపతి శివాజీ తనయుడు ఛత్రపతి శంభాజీ జీవిత కథతో ఈ సినిమా రూపొందింది.
హిస్టారికల్ మూవీ కావడంతో దీన్ని రూ.130 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందింది. హిందీలో రీజనల్ మూవీగానే ఈ సినిమా రూపొందింది. అయితే ఇప్పటికే ఈ సినిమా రూ.270 కోట్ల వరకు వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయింది. రాబోయే రోజుల్లో ఈ సినిమా మరింతగా కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ‘చావా’ వంటి సినిమాలు తెలుగు స్టార్ హీరోలు చేయరు అంటూ కొంతమంది విమర్శిస్తున్నారు. వాస్తవానికి హిందీ వెర్షన్ ను కూడా తెలుగు ప్రేక్షకులు ఎగబడి చూస్తున్నారు.
ఈ క్రమంలో ‘చావా’ గురించి ఓ ఆసక్తికర చర్చ సోషల్ మీడియాలో నడుస్తుంది. అదేంటి అంటే ఈ సినిమా కథని దర్శకుడు లక్ష్మణ్.. ముందుగా మహేష్ బాబుకి (Mahesh Babu) వినిపించాడట. కొన్నేళ్ల క్రితమే ఈ కథని మహేష్ వినడం జరిగిందట. కానీ ఎందుకో ఈ ప్రాజెక్టు చేయడానికి మహేష్ ఇంట్రెస్ట్ చూపించలేదట. దీంతో దర్శకుడు ఇది వర్కౌట్ కాదు..అని భావించి కొన్నాళ్ల పాటు పక్కన పెట్టేశాడట. కానీ తర్వాత విక్కీ కౌశల్ వంటి హీరో దీన్ని ఓకే చేయడం, ‘యురి’ తో అతని మార్కెట్ కూడా రూ.200 కోట్లు ఉండటం వల్ల…
‘చావా’ ని మొదలుపెట్టి చాలా బ్యాలెన్స్డ్ గా కంప్లీట్ చేశారట. ఇక ఈ వార్త బయటకు రావడంతో మహేష్ బాబు అభిమానులు బాగా హర్ట్ అవుతున్నారు. ‘పుష్ప’ ని (Pushpa) కూడా మహేష్ రిజెక్ట్ చేయడం.. అది ఇండస్ట్రీ హిట్ అవ్వడం. ఇప్పుడు ‘చావా’ కూడా భారీ వసూళ్లు సాధిస్తుండటం వల్ల.. మంచి సినిమాలు మహేష్ మిస్ చేసుకున్నట్టు వాళ్ళు డిజప్పాయింట్ అవుతున్నారు.