SSMB28: ఆ సెంటిమెంట్ ఫాలో అయితే మహేష్ మూవీ బ్లాక్ బస్టరా?

ప్రతి హీరోకు సెంటిమెంట్లు ఉంటాయి. కొన్నిసార్లు పాజిటివ్ సెంటిమెంట్లు వర్కౌట్ అయ్యి సినిమాలు సక్సెస్ సాధించిన సందర్భాలు సైతం ఉన్నాయి. అయితే హెడ్ బ్యాండ్ కడితే మహేష్ బాబు మూవీ హిట్టేనని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. మహేష్ బాబు కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్లలో పోకిరి మూవీ ఒకటి. ఈ సినిమాలో మహేష్ హెడ్ బ్యాండ్ లో కనిపించిన సంగతి తెలిసిందే. కమర్షియల్ గా కూడా ఈ సినిమా సక్సెస్ సాధించింది.

కొరటాల శివ డైరెక్షన్ లో మహేష్ హీరోగా శ్రీమంతుడు సినిమా తెరకెక్కగా ఈ సినిమాలో కూడా మహేష్ బాబు హెడ్ బ్యాండ్ లో కనిపించడం గమనార్హం. తాజాగా మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీకి సంబంధించి ఒక పిక్ లీక్ కాగా ఈ పిక్ లో మహేష్ హెడ్ బ్యాండ్ లో కనిపించారు. ఈ పిక్ చూసిన మహేష్ ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు. సెంటిమెంట్ రిపీట్ అయితే మహేష్ ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ గ్యారంటీ అని కామెంట్లు చేస్తున్నారు.

ఆగష్టు 11వ తేదీన థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేయబోతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. మహేష్ బాబు రెమ్యునరేషన్ 70 కోట్ల రూపాయలుగా ఉండగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మహేష్ త్రివిక్రమ్ బాక్సాఫీస్ వద్ద మరోసారి ఆ మ్యాజిక్ ను రిపీట్ చేస్తారో లేదో చూడాల్సి ఉంది. అతడు, ఖలేజా సినిమాలు ఆశించిన ఫలితాన్ని అందుకోకపోయినా ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.

మహేష్ సినిమాలకు అన్ని వర్గాల ప్రేక్షకులలో అభిమానులు ఉంటారు. క్లాస్ ప్రేక్షకులతో పాటు మాస్ ప్రేక్షకులలో కూడా మహేష్ బాబుకు అభిమానులు ఉన్నారు. మహేష్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేయడం గ్యారంటీ అని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus