Mahesh Babu: మహేష్‌ కేబీఆర్‌ పార్క్‌కి ఎందుకు వెళ్లడో తెలుసా?

హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్క్‌లో వాకింగ్‌ చేయడానికి నగరం మొత్తంలో భయపడేవారు ఎవరైనా ఉన్నారా అంటే అది మహేష్‌బాబు అనే చెప్పాలి. కావాలంటే ఆ విషయం ఆయన్నే అడగండి చెబుతాడు. గతంలో ఓసారి వెళ్లిన మహేష్‌ బాబు… మరోసారి ఆ పేరు ఎత్తితేనే వామ్మో అనేంతగా భయపడ్డాడు. అసలు అక్కడ ఏమైంది అనేది మహేష్‌బాబునే చెప్పాడు. బాలకృష్ణ హోస్ట్‌గా ‘ఆహా’లో ప్రసారమవుతున్న ‘అన్‌స్టాపబుల్‌’ షోకి బాలయ్య ముఖ్య అతిథిగా విచ్చేసిన విషయం తెలిసిందే.

ఫిబ్రవరి నాలుగున ఈ షో ప్రసారమవుతుంది. దానికి సంబంధించి ప్రోమోలో మహేష్‌ ఈ కేబీఆర్‌ పార్క్‌ సంగతులు చెప్పుకొచ్చాడు. గతంలో ఓ సారి మహేష్‌ ఇలానే కేబీఆర్‌ పార్క్‌కి వెళ్లాడట. ఒక రౌండ్‌ రన్నింగ్‌ చేసి గేట్‌ దగ్గరకు వస్తుండగా ఓ పాము కనిపించిందట. మనందరిలాగే మహేష్‌కి కూడా పాము అంటే భయం. ఇంకేముంది ఒక్కసారిగా పరుగు అందుకున్నాడట. ఐదు కిలోమీటర్లు పార్క్‌లో రౌండ్‌ కొట్టిన వచ్చిన మహేష్‌, అదే ఐదు కిలోమీటర్లు వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్లి గేటు నుండి బయటకు వెళ్లిపోయాడట.

ఆ తర్వాత ఎప్పుడూ అటువైపు వెళ్లలేదట. అంతగా భయపడ్డాడట మహేష్‌ కేబీఆర్‌ పార్క్‌ అంటే. దీంతోపాటు మహేష్‌ మరికొన్ని విషయాలు కూడా చెప్పుకొచ్చాడు. ‘భరత్‌ అనే నేను’ సినిమా షూటింగ్‌లో సీరియస్‌గా డైలాగ్‌లు చెబుతుంటే… ఒకామె మొబైల్‌లో మునిగిపోయిందట. అది చూసి మహేష్‌ చాలా కోపంగా అరిచేశాడట. అయితే ఒక్కోసారి మహేష్‌ ఇలాంటి మాటలు కాకుండా మహేష్‌ చాలా చమత్కారంగా ఉంటాడని కూడా చెప్పారు బాలయ్య. ఆ విషయాన్ని మహేష్‌ ఈ ప్రోమోలోనే చూపించారు.

బాలయ్య ఏదో అంటే… ఆఖరున ఫ్యాన్స్‌కి చిన్న ఝలక్‌ ఇచ్చాడు. ఈ కార్యక్రమంలో మహేష్‌తోపాటు ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా హాజరయ్యాడు. వంశీ, మహేష్‌ మంచి మిత్రులనే విషయం తెలిసిందే. మరి ఇద్దరూ కలసి ఏయే విషయాలు చెప్పారు, ఎంత సందడి చేశారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. అన్నట్లు ఈ ప్రోమో యూట్యూబ్‌లో అదరగొట్టేస్తోంది.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus