Mahesh Babu: ఆ వెబ్ సిరీస్ కు రివ్యూ ఇచ్చిన మహేష్ బాబు.. అలా ఎలా చేస్తారంటూ?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. మహేష్ రాజమౌళి సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని క్రేజీ అప్ డేట్స్ రానున్నాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మహేష్ బాబు తాజాగా ఒక వెబ్ సిరీస్ గురించి రివ్యూ ఇచ్చారు. ఫారెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ పోచర్ వెబ్ సిరీస్ ను చూసిన మహేష్ బాబు “ఏనుగులను అలా ఎలా చంపేస్తారు? అలా చంపేసే సమయంలో ఆ వ్యక్తుల చేతుల వణకవా?” అని కామెంట్లు చేశారు.

“అలా చేసే వ్యక్తులలో హ్యూమానిటీ ఉండదా? ఈ సిరీస్ చూస్తున్న సమయంలో నా మనస్సులో ఇవే ప్రశ్నలు రన్ అయ్యాయి? ఈ జెంటిల్ జెయింట్స్ ను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ పోరాడాలి” అని మహేష్ బాబు అభిప్రాయపడ్డారు. మహేష్ బాబు ఇన్ స్టాగ్రామ్ ద్వారా చేసిన పోస్ట్ కు దాదాపుగా 2 లక్షల లైక్స్ వచ్చాయి. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న పోచర్ వెబ్ సిరీస్ పై మహేష్ బాబు అంచనాలను మరింత పెంచారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి కాంబో క్రేజీ కాంబో కాగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పూర్తైంది. మహేష్ సినిమా విషయంలో జక్కన్న ఒకింత భారీ స్థాయిలోనే ప్లాన్ చేస్తున్నారని సమాచారం అందుతోంది. నేషనల్ లెవెల్ లో ఈ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేయనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. యాక్షన్ అడ్వెంచర్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఈ సినిమాకు కొత్త టెక్నాలజీలను వినియోగిస్తున్నారని తెలుస్తోంది. తన సినిమాకు పని చేసే టెక్నీషియన్ల విషయంలో సైతం రాజమౌళి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ సినిమా లుక్ రివీల్ కాకుండా మహేష్ బాబు జాగ్రత్తలు తీసుకుంటున్నారని భోగట్టా. ఈ సినిమా మొదలయ్యే సమయానికి మహేష్ బాబు (Mahesh Babu) యాడ్స్ కు సంబంధించిన షూట్ ను పూర్తి చేయనున్నారని తెలుస్తోంది.

జీవితంలో నేను కోరుకునేది ఇది మాత్రమే.. శోభిత చెప్పిన విషయాలివే!

‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus