Mahesh Babu: ఆ రోల్ మహేష్ బాబు కెరీర్ కు ప్లస్ అవుతుందా?

సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువేననే సంగతి తెలిసిందే. మహేష్ బాబు వరుస విజయాలను సొంతం చేసుకోగా త్రివిక్రమ్ సినిమాతో మహేష్ బాక్సాఫీస్ ను మరోసారి షేక్ చేస్తారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ షూట్ ఇప్పటికే 30 శాతం పూర్తైందని తెలుస్తోంది. అతడు, ఖలేజా సినిమాల తర్వాత ఈ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ఇదే కావడం గమనార్హం. మహేష్ కు జోడీగా పూజా హెగ్డే, శ్రీలీల నటిస్తుండగా తాజాగా శ్రీలీల ఈ సినిమా షూట్ లో జాయిన్ అయ్యారని సమాచారం అందుతోంది.

మహేష్ ఈ సినిమాలో సూపర్ కాప్ రోల్ లో కనిపించనున్నారని తెలుస్తోంది. గతంలో పలు సినిమాలలో సూపర్ కాప్ రోల్స్ లో నటించి మహేష్ విజయాలను సొంతం చేసుకోగా ఈ సినిమాతో మహేష్ ఖాతాలో మరో సక్సెస్ చేరుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీకి థమన్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా త్రివిక్రమ్ సినిమాలకు వరుసగా థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపికవుతున్నారు.

అయితే మహేష్ సినిమాలకు థమన్ ఆశించిన రేంజ్ లో మ్యూజిక్ ఇవ్వడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ కామెంట్లకు చెక్ పెట్టేలా థమన్ అడుగులు వేయాల్సి ఉంది. సినిమా సినిమాకు థమన్ మార్కెట్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. థమన్ తెలుగులో దాదాపుగా అందరు స్టార్ హీరోల సినిమాలకు పని చేశారు.

థమన్ పారితోషికం ప్రస్తుతం 4 నుంచి 5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. మహేష్ థమన్ కాంబినేషన్ హిట్ కాంబినేషన్ కాగా త్రివిక్రమ్ సినిమాతో ఈ కాంబినేషన్ మళ్లీ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ అనిపించుకుంటుందేమో చూడాల్సి ఉంది. సినిమా సినిమాకు అటు మహేష్ క్రేజ్ పెరుగుతుండగా ఇటు థమన్ క్రేజ్ పెరుగుతోంది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus