Mahesh Babu: ఆ సినిమాల ఫలితాలతో సంబంధం లేదన్న మహేష్.. కానీ?

స్టార్ హీరో మహేష్ బాబు (Mahesh Babu) కొత్త లుక్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రతి సినిమాలో మహేష్ బాబు ఒకే తరహా లుక్ లో కనిపిస్తారనే కామెంట్లకు చెక్ పెడుతూ రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు ఎంతో కష్టపడుతున్నారు. 2025 సంవత్సరంలో మహేష్ జక్కన్న (S. S. Rajamouli) కాంబో మూవీ షూట్ మొదలుకానుండగా 2028 సంవత్సరంలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. మహేష్ రాజమౌళి కాంబో మూవీ అంతకంతకూ ఆలస్యం అయ్యే కొద్దీ ఈ సినిమా బడ్జెట్ పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి.

Mahesh Babu

అయితే బాలనటుడిగా మహేష్ బాబు ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాల గురించి ఆ సినిమాల ఫలితాల గురించి మహేష్ బాబు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలనటుడిగా కొన్ని సినిమాలలో నటించానని ఆ సినిమాలు ఎందుకు హిట్టయ్యాయో తెలియదని మహేష్ అన్నారు. సమ్మర్ హాలిడేస్ సమయంలో షూటింగ్ లో పాల్గొనేవాడినని మహేష్ బాబు చెప్పుకొచ్చారు. ఆ సినిమాలు సక్సెస్ సాధించినా ఆ సినిమాల ఫలితాలతో నాకు సంబంధం లేదని మహేష్ బాబు పేర్కొన్నారు.

ఒక సినిమా షూట్ ఆలస్యం కావడం వల్ల ఏడాది పాటు స్కూల్ కు దూరంగా ఉండాల్సి వచ్చిందని సూపర్ స్టార్ మహేష్ బాబు చెప్పుకొచ్చారు. మహేష్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ ఆకాశమే హద్దుగా పెరుగుతుండగా పాన్ వరల్డ్ స్థాయిలో మహేష్ బాబు బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబును అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండగా మహేష్ బాబు కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు.

మహేష్ రాజమౌళి సినిమాను పూర్తి చేసి కొత్త ప్రాజెక్ట్ లను ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి. రాజమౌళి సినిమాల విషయంలో వేగం పెంచాల్సిన అవసరం అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. మహేష్ బాబు సోషల్ మీడియాలో సైతం అంతకంతకూ క్రేజ్ పెంచుకుంటున్నారు. మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం పడుతున్న కష్టాన్ని చూసి నెటిజన్లు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. అరుదైన తెగకు సంబంధించిన కథతో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది.

 రవితేజ కొత్త సినిమా అప్‌డేట్‌.. ప్రెస్టీజియస్‌ సినిమాలో అలా కనిపిస్తాడా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus