Mahesh Babu, Rajamouli: జక్కన్నతో సినిమాపై మహేష్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

మహేష్ రాజమౌళి కాంబో మూవీ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాను వేగంగా పూర్తి చేసి మహేష్ రాజమౌళి సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయని సమాచారం అందుతోంది. ఈరోజు మహేష్ బాబు పుట్టినరోజు కాగా సోషల్ మీడియా వేదికగా సినీ, రాజకీయ ప్రముఖులు మహేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమా గురించి స్పందిస్తూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

దర్శకధీరుడు రాజమౌళితో ఒక సినిమాకు పని చేస్తే 25 సినిమాలకు పని చేసినట్లేనని ఈ సినిమాలోని పాత్ర కోసం శ్రమించాల్సి ఉంటుందని మహేష్ చెప్పుకొచ్చారు. ఎందుకోసం అంటే సినిమా దానిని డిమాండ్ చేస్తుందని మహేష్ కామెంట్లు చేశారు. రాజమౌళి కాంబో మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని మహేష్ చెప్పుకొచ్చారు. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కనుందని మహేష్ వెల్లడించారు. ఈ సినిమా ప్రేక్షకులందరికీ నచ్చుతుందని నేను ఆశిస్తున్నానని మహేష్ బాబు కామెంట్లు చేశారు.

యాక్షన్ అడ్వెంచర్ గా ఆఫ్రికా అడవుల బ్యాక్ డ్రాప్ లో మహేష్ జక్కన్న కాంబో మూవీ తెరకెక్కనుంది. మహేష్ బర్త్ డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా పోకిరి సినిమా స్పెషల్ షోస్ ప్రదర్శితం కానున్నాయని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి 200 షోస్ స్క్రీనింగ్ వేయనున్నారని బోగట్టా.

పోకిరి సినిమా స్పెషల్ షోల ద్వారా వచ్చిన ఆదాయం మహేష్ బాబు ఫౌండేషన్ కు విరాళంగా ఇవ్వనున్నారని తెలుస్తోంది. 2006 సంవత్సరం ఏప్రిల్ 28వ తేదీన విడుదలైన పోకిరి అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా 40 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించి ఈ సినిమా వార్తల్లో నిలిచింది. మహేష్ రాజమౌళి కాంబో మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus