SSMB28: త్రివిక్రమ్ కు కాల్ చేసిన మహేష్ బాబు.. ఏం చెప్పారంటే?

మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ షూట్ అంతకంతకూ వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే. కృష్ణ మరణం వల్ల ఇప్పట్లో ఈ సినిమా షూట్ మొదలయ్యే అవకాశాలు లేవని కామెంట్లు ప్రచారంలోకి వస్తున్నాయి. మరోవైపు వరుస ఘటనల నేపథ్యంలో త్రివిక్రమ్ మూవీని మహేష్ ఆపేశారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అయితే వైరల్ అవుతున్న వార్తలకు సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చింది. తండ్రి చనిపోయిన బాధలో ఉన్న మహేష్ బాబు తన వల్ల నిర్మాతలు ఇబ్బందులు పడకూడదని భావించి డిసెంబర్ నెల 8వ తేదీ నుంచి షూట్ లో పాల్గొంటానని చెప్పినట్టు సమాచారం.

మూడు వారాల తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. షూటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు సూచించారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ వేర్వేరు కారణాల వల్ల వాయిదా పడగా ఈ ప్రాజెక్ట్ ను మరింత ఆలస్యం చేయడం కరెక్ట్ కాదని మహేష్ బాబు భావిస్తున్నారు. ఈ సినిమా పూర్తైతే మాత్రమే రాజమౌళి మూవీ షూట్ లో పాల్గొనే అవకాశం ఉండటంతో ఈ సినిమా షూట్ ను వీలైనంత వేగంగా పూర్తి చేయాలని భావిస్తున్నారు.

షూట్ ను మరింత ఆలస్యం చేస్తే ఇతర నటీనటుల డేట్స్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయని మహేష్ భావిస్తున్నారు. షూటింగ్ గురించి మహేష్ అలా చెప్పడంతో త్రివిక్రమ్ షాకయ్యారని సమాచారం. సాధారణ సన్నివేశాలను షూట్ చేయాలని మహేష్ పై పెద్దగా ఒత్తిడి పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని త్రివిక్రమ్ భావిస్తున్నారని సమాచారం అందుతోంది.

హైదరాబాద్ లో మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ షూట్ జరగనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. ఈ సినిమాలో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన మహర్షి సినిమా సక్సెస్ సాధించగా తర్వాత సినిమాతో మళ్లీ ఈ సెంటిమెంట్ ను రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus