Mahesh Babu: ఆ సీక్వెల్ పై ఆసక్తి చూపిస్తున్న మహేష్ బాబు..?

ఈ మధ్య కాలంలో దర్శకనిర్మాతలు ఒక సినిమా హిట్టైతే ఆ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించాలని ఆలోచనలు చేస్తున్నారు. సీక్వెల్ సినిమాలకు రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం వల్ల దర్శకనిర్మాతలు సీక్వెల్స్ పై ఆసక్తి చూపుతున్నారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో సీక్వెల్ సినిమాలు ఎక్కువగా హిట్ కాలేదు. అయితే మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు మూవీ సీక్వెల్ లో నటించబోతున్నారంటూ ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దర్శకుడు అనిల్ రావిపూడి మహేష్ బాబు కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉండగా ఈ సినిమా సరిలేరు నీకెవ్వరు సినిమాకు సీక్వెల్ అని ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

మహేష్ బాబు తన సినీ కెరీర్ లో ఇప్పటివరకు సీక్వెల్ లో నటించలేదు. పోకిరి సీక్వెల్ లో మహేష్ నటిస్తారని గతంలో ప్రచారం జరిగినా ఆ ప్రచారం నిజం కాలేదు. క్లాసిక్ సినిమాలను టచ్ చేయడానికి మహేష్ అస్సలు ఇష్టపడరు. అయితే సరిలేరు నీకెవ్వరు సినిమా సీక్వెల్ లో నటించడానికి మహేష్ బాబు కూడా ఆసక్తి చూపిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్ 3 సినిమాను తెరకెక్కిస్తుండగా ఈ సినిమా సీక్వెల్ కాదని అనిల్ రావిపూడి ఇప్పటికే స్పష్టతనిచ్చారు.

అనిల్ రావిపూడి రాజా ది గ్రేట్ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుండగా సరిలేరు నీకెవ్వరు సీక్వెల్ గురించి కూడా వార్తలు వస్తుండటం గమనార్హం.అయితే మహేష్ ఫ్యాన్స్ మాత్రం సరిలేరు నీకెవ్వరు సినిమా సీక్వెల్ పై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. మహేష్ ఫ్యాన్స్ లో కొందరు ఈ సినిమా సీక్వెల్ గురించి వస్తున్న వార్తల విషయంలో టెన్షన్ పడుతున్నారు. సరిలేరు నీకెవ్వరు సీక్వెల్ పట్టాలెక్కుతుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus