Mahesh: కృష్ణ జయంతి… నాన్నను తలుచుకొని అలాంటి ట్వీట్ చేసిన మహేష్!

మే 31 సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు కావడంతో నేడు కృష్ణ గారి జయంతి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తన తండ్రి జయంతి వేడుకను పురస్కరించుకొని మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా నుంచి మహేష్ బాబు మాస్ లుక్ కి సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు.

ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అయితే (Mahesh) మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా ఈ పోస్టర్ ను షేర్ చేస్తూ..ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు ఇది మీకోసమే నాన్న అంటూ తన తండ్రిని తలుచుకొని మహేష్ బాబు చేసినటువంటి ట్వీట్ వైరల్ అవుతుంది. మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా టైటిల్ ని కూడా ఈరోజే ప్రకటించబోతున్నారు.

ఈరోజు సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు ఈ సినిమా టైటిల్ తో పాటు గ్లింప్స్ కూడా విడుదల చేయబోతున్నారు. ఇలా ఈ సినిమా నుంచి అప్డేట్ రానుండడంతో మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే నేడు కృష్ణ గారి జయంతి కావడంతో ఆయన జయంతిని పురస్కరించుకొని కృష్ణ గారు నటించిన మోసగాళ్లకు మోసగాడు సినిమాని కూడా తిరిగి విడుదల చేసిన సంగతి తెలిసిందే.

కృష్ణ గారు నటించిన మొట్టమొదటి కౌబాయ్ చిత్రమైనటువంటి మోసగాళ్లు మోసగాడు చిత్రాన్ని నేడు ప్రేక్షకుల ముందుకు తిరిగి తీసుకువచ్చారు. ఇక కృష్ణ జయంతి రోజునే మహేష్ బాబు సినిమా టైటిల్ కూడా ప్రకటించబోతున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడిగా పూజ హెగ్డే, నటి శ్రీ లీల నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus