సూపర్ స్టార్ మహేష్ బాబు రీల్ హీరోగా కోట్ల సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నారు. అయితే మహేష్ బాబు రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరోనని ప్రూవ్ చేసుకుంటున్నారు. నేడు సూపర్ స్టార్ మహేష్ బాబు తండ్రి కృష్ణ పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మహేష్ తమ స్వగ్రామైన బుర్రిపాలెంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లు చేశారు. అభిమానులను దృష్టిలో ఉంచుకుని మహేష్ బాబు బుర్రిపాలెం గ్రామ ప్రజలకు అవసరమైన వైద్య సహకారం అందించడంతో పాటు గ్రామంలో ఆరురోజుల పాటు వ్యాక్సిన్ పంపిణీ జరిగేలా చర్యలు చేపట్టారు.
బుర్రిపాలెం గ్రామంలో మొత్తం 12 వార్డులు ఉండగా రోజుకు రెండు వార్డుల చొప్పున వ్యాక్సిన్ పంపిణీ జరగనుందని సమాచారం అందుతోంది. 45 సంవత్సరాల వయస్సు పైబడిన వారికి మొదట వ్యాక్సిన్ పంపిణీ జరగనుంది. కొన్నిరోజుల క్రితమే మహేష్ బాబు బుర్రిపాలెం గ్రామ ప్రజలకు వ్యాక్సిన్ ను పంపిణీ చేయడానికి సిద్ధమయ్యారని వార్తలు రాగా ఆ వార్తలు ఎట్టకేలకు నిజమయ్యాయి. బుర్రిపాలెం గ్రామానికి చెందిన మహేష్ బాబు అభిమానులు వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిన మహేష్ బాబుకు మీడియా ముఖంగా కృతజ్ఞతలు చెప్పడం గమనార్హం.
మహేష్ బాబులా మిగతా హీరోలు కూడా వ్యాక్సిన్ పంపిణీ విషయంలో ముందుకొస్తే బాగుంటుందని ప్రజల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు మహేష్ బాబు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కరోనా విజృంభణ తగ్గితే మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. మరోవైపు మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయం తెలియాల్సి ఉంది.
1
2
3
4
5
Most Recommended Video
ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!