SSMB28: మహేష్ సినిమాలో ఆ గొడవలను టచ్ చేయబోతున్నారా?

మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన అతడు, ఖలేజా సినిమాలు క్లాసిక్స్ గా పేరు తెచ్చుకున్నాయి. ఈ కాంబినేషన్ లో మరో సినిమా ఫిక్స్ కాగా ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా త్రివిక్రమ్ సినిమాలు ఫ్యామిలీ సినిమాలుగా తెరకెక్కుతాయి. అయితే మహేష్ తో త్రివిక్రమ్ తెరకెక్కించే సినిమాలో ఫ్యామిలీ అంశాలతో పాటు యాక్షన్ కు కూడా ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. పల్నాడు రాజకీయాలకు సంబంధించిన కథాంశంతో

ఈ సినిమా తెరకెక్కుతోందని పల్నాడు గొడవలను ఈ సినిమాలో టచ్ చేయనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. దాదాపుగా 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా డిజిటల్ హక్కులు ఇప్పటికే అమ్ముడయ్యాయి. ఇండిపెండెన్స్ డే కానుకగా విడుదల కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. విలేజ్ నేటివిటీతో ఈ సినిమా తెరకెక్కనుండగా మహేష్ త్రివిక్రమ్ కెరీర్ లో ఈ సినిమా స్పెషల్ మూవీగా నిలవాలని అభిమానులు భావిస్తున్నారు.

ఈ ఏడాది జూన్ సమయానికి ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల మహేష్ కు జోడీగా నటిస్తున్నారని సమాచారం అందుతోంది. ఈ సినిమాతో శ్రీలీల స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకుంటారని కామెంట్లు వినిపిస్తున్నాయి. కృతిశెట్టిని మించి శ్రీలీల క్రేజ్ ను సొంతం చేసుకోవడంతో పాటు ఇతర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్నారు. బాలయ్య అనిల్ రావిపూడి కాంబో మూవీలో సైతం శ్రీలీల నటిస్తున్న సంగతి తెలిసిందే.

వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లలో ఆఫర్లను సొంతం చేసుకుంటున్న శ్రీలీల రాబోయే రోజుల్లో ఇతర భాషల్లో కూడా సత్తా చాటుతారేమో చూడాల్సి ఉంది. సినిమా సినిమాకు శ్రీలీల మార్కెట్ ఊహించని రేంజ్ లో పెరుగుతోంది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus