Sarkaru Vaari Paata: ప్రొడక్షన్ టీమ్ కి వార్నింగ్ ఇచ్చిన స్టార్ హీరో!

సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. దర్శకుడు పరశురామ్ రూపొందిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే జరుగుతోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కథ ప్రకారం మహేష్ బాబు ఒక సెక్షన్ ఆఫ్ పబ్లిక్ కి క్లాస్ పీకే సీన్ ఉందని తెలుస్తోంది. ”పొద్దునే లేచి వాకింగ్ చేశామా..? మంచి డైట్‌ ఫుడ్‌ తిన్నామా..? మళ్లీ సాయంత్రం అయ్యాక మొబైల్‌ చూశామా..? కొడుకు, మనవడు, మనవరాలితో ఆడుకుని..

మళ్లీ తిని పడుకున్నామా..? లేదా..?ఇదే కదా మనం చేసేది రోజూ..” అంటూ మహేష్ చెప్పే ఈ డైలాగ్ లీక్ అయింది. సినిమాలో ఇది ఉంటుందా లేదా అనే విషయంలో తరువాత క్లారిటీ వస్తుంది. అయితే ఈ లీక్స్ విషయంలో మహేష్ బాబు అప్సెట్ అయినట్లు తెలుస్తోంది. ఇలా డైలాగ్స్ బయటకు వెళ్లిపోతే కథపై ఆసక్తి తగ్గిపోతుందని.. సెట్ లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలంటూ ప్రొడక్షన్ టీమ్ కి వార్నింగ్ ఇచ్చారట.

దీంతో సెట్స్ లో సెక్యూరిటీను పెంచినట్లు తెలుస్తోంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.


పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus