SSMB28: పూజాహెగ్డే కోసం మహేష్ బాబు వెయిటింగ్!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో దర్శకుడు త్రివిక్రమ్ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇదివరకు వీరిద్దరి కాంబినేషన్ లో ‘ఖలేజా’, ‘అతడు’ వంటి సినిమాలొచ్చాయి. ఈ సినిమాలను అభిమానించేవారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మరోసారి మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా అనగానే బజ్ పెరిగింది. ఇప్పటికే ఈ సినిమా ఒక షెడ్యూల్ కూడా పూర్తయింది. అయితే మొదటినుంచి కూడా ఈ సినిమాకి సంబంధించిన రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి.

ఈ సినిమా షూటింగ్ చేయకుండా కావాలనే మహేష్ ఫారెన్ ట్రిప్ కి వెళ్లిపోయారని.. త్రివిక్రమ్ దగ్గర అసలు ఫైనల్ స్క్రిప్ట్ రెడీగా లేదని.. ఇలా రకరకాల వార్తలు వినిపించాయి. కానీ రీసెంట్ గా చిత్రనిర్మాత సెకండ్ షెడ్యూల్ గురించి చెప్పడంతో అంతా సెట్ అయిందని తెలిసింది. షూటింగ్ లో పాల్గొనడానికి మహేష్ రెడీ అవుతున్నారు. అయితే హీరోయిన్ గా రెడీగా లేదని సమాచారం. సెకండ్ షెడ్యూల్ లో హీరో, హీరోయిన్ల కాంబినేషన్ సీన్లు ప్లాన్ చేశారు.

కానీ పూజా కాలికి గాయం కావడంతో.. డాక్టర్స్ ఆమెని రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. రెస్ట్ తీసుకొని.. ఆ తరువాత మరోసారి స్కాన్ చేయించుకొని, అంతా సెట్ అయిన తరువాతే సెట్స్ మీదకు రావాల్సి ఉంటుంది. అందుకే ఈ నెలలో ప్లాన్ చేసిన ఈ సినిమా షూటింగ్ కాస్త వెనక్కి వెళ్తుందని అంటున్నారు. బహుశా డిసెంబర్ తొలివారంలో షూటింగ్ ఉండొచ్చని టాక్.

ఇప్పటికే సినిమా షూటింగ్ ఆలస్యమవుతోంది. ఇప్పుడు పూజా కాలి గాయం సమస్యగా మారింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus