స్టార్ హీరో మహేష్ బాబుకు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. యావరేజ్ కంటెంట్ తో సైతం బ్లాక్ బస్టర్ హిట్లను సాధిస్తున్న మహేష్ బాబుకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. మహేష్ బాబు పారితోషికం 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా రాజమౌళి సినిమాతో బ్లాక్ బస్టర్ సాధిస్తే దేశవిదేశాల్లో మహేష్ బాబుకు క్రేజ్ ఊహించని రేంజ్ లో పెరగనుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబుకు పుస్తకాలు చదవడం అంటే కూడా ఎంతో ఇష్టమట.
సేపియన్స్: ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ హ్యూమన్‌కైండ్ బుక్ తో పాటు ఎమోషనల్ ఇంటెలిజెన్స్, చాటర్: ది వాయిస్ ఇన్ అవర్ హెడ్ అండ్ హౌ టు హార్నెస్ ఇట్, థింక్ లైక్ ఎ సన్యాసి పుస్తకాలను మహేష్ బాబు ఎంతో ఇష్టం చదువుతారట. ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాలను మహేష్ బాబు ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ఎవ్రీడే హీరో మ్యానిఫెస్టో అనే పుస్తకాన్ని ప్రస్తుతం చదువుతున్నానని మహేష్ బాబు అభిమానులతో చెప్పుకొచ్చారు.
నటుడిగా ఎంత బిజీగా ఉన్నా మహేష్ బాబు పుస్తకాలకు సమయం కేటాయిస్తున్నారంటే గ్రేట్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి సినిమా తర్వాత ఎవరి డైరెక్షన్ లో నటిస్తారనే ప్రశ్నలకు సంబంధించి సమాధానాలు దొరకాల్సి ఉంది. మహేష్ బాబు ఎక్కువ సినిమాల్లో ఒకే తరహా లుక్స్ లో కనిపించినా ఇకపై మాత్రం సినిమా సినిమాకు లుక్ విషయంలో వైధ్యం ఉండేలా జాగ్రత్తలు తీసుకోనున్నారని తెలుస్తోంది.
కథల విషయంలో ఇకపై మరిన్ని జాగ్రత్తలు తీసుకునే దిశగా మహేష్ బాబు (Mahesh Babu) అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది. భవిష్యత్తు సినిమాలు మహేష్ బాబుకు భారీ విజయాలను అందించాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. మహేష్ బాబు కెరీర్ పరంగా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.