టాలీవుడ్ అంటే హీరోల నుంచి లైట్ మన్ వరకూ ఒక దేవాలయం. అయితే ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని గొడవలు జరిగిన, ఎన్ని వదంతులు ఏర్పడినా, చివరకు టాలీవుడ్ బావుంటేనే ఈ పై చెప్పిన వాళ్ళంతా హ్యాపీగా, దార్జాగా ఉండేది. ఇదిలా ఉంటే, టాలీవుడ్ ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళాడు మన జెక్కన్న, మరో పక్క హీరోలు సైతం టాలీవుడ్ లుక్ మార్చే క్రమంలో తమవంతు పాత్ర తాము పోషిస్తూ ఉన్నారు అనే చెప్పాలి, ఎలాగా అంటే, ఒక్కసారి ఈ కధ చదవండి మీకే తెలుస్తుంది. విషయం ఏమిటంటే, టాలీవుడ్ కి కొత్త రకంగా చూపించే ప్రయత్నంలో, తమ సినిమాలకి కొత్త రంగులు అద్దె క్రమంలో సరికొత్త, బాగా అనుభవం కలిగి ఉన్న, ఇంకా చెప్పాలి అంటే బాగా కాస్ట్లీ సినిమాటోగ్రాఫర్స్ ను ఎన్నుకుంటున్నారు మన యువ హీరోలు. ప్రిన్స్ మహేష్ బాబు సంగతే తీసుకుంటే, టాలీవుడ్ సూపర్ స్టార్.. కొరటాల శివతో ‘భరత్ అను నేను’ ప్రాజెక్టును చేస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఆ సినిమా కోసం బాలీవుడ్.. కోలీవుడ్ లలో భారీ సినిమాలకు పని చేసిన రవి కె. చంద్రన్ ని సెలెక్ట్ చేసుకున్నాడని సమాచారం. ఇక రవి కె. చంద్రన్ విషయానికి వస్తే, రెండున్నర దశాబ్దాలకు అనుభవం ఉన్న సినిమాటోగ్రాఫర్, అదే క్రమంలో బ్లాక్.. ఫనా.. రబ్ నే బనా దీ జోడీ.. మై నేమ్ ఈజ్ ఖాన్.. బార్ బార్ దేఖో వంటి హిందీ చిత్రాలతో పాటు.. తమిళ్ సెవెంత్ సెన్స్ చిత్రానికి వర్క్ చేసి, ఇప్పుడు ప్రిన్స్ తో తెలుగులో జ్యాక్‌పాట్ ఎంట్రీ కొట్టేసాడు. ఇక ప్రిన్స్ ఇప్పటికే రత్నవేలుతో బ్రహ్మోత్సవం చేశాడు, సంతోష్ శివన్ తో స్పైడర్ చేస్తునాడు, ఇప్పుడు రవి కె చంద్రన్ తో కొత్త సినిమా చేస్తూ ఉంటే, అదే క్రమంలో ప్రిన్స్ కన్నా మన బన్నీ మంచి ఫాస్ట్ గా ఉన్నాడు అనే చెప్పాలి, ప్పటికే సరైనోడు చిత్రానికి రిషి పంజాబీ.. దువ్వాడ జగన్నాధం కు అయాంక బోస్ వంటి కాస్ట్లీ సినిమాటోగ్రాఫర్లను ఎందుకున్నాడు బన్నీ, అడ్వాన్సెడ్ గా ఆలోచించి. మరి ఇలా అందరు హీరోలు విజువల్స్ విషయంలో ఛేంజ్ చూపించేందుకు సినిమాటోగ్రాఫర్స్ ను మారుస్తూ టాలీవుడ్ తీరును మార్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అనే చెప్పాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.