Sai Dharam Tej: సాయితేజ్‌ యాక్సిడెంట్‌పై నిర్మాత మహేష్‌ కోనేరు వివరణ!

  • September 12, 2021 / 04:10 PM IST

సాయిధరమ్‌ తేజ్‌యాక్సిడెంట్‌ గురించి మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. బైక్‌ వివరాలు ఇవీ, దాని స్పీడ్‌ ఇంత, ఆ సమయంలో సాయితేజ్‌ పరిస్థితి అంటూ రకరకాలు రాసుకొస్తున్నారు. అయితే పోలీసుల వివరాల ప్రకారం సాయితేజ్‌ ఆ సమయంలో వేగంగా బైక్‌ నడుపుతుండటమే కారణం అని చెప్పారు. దాంతోపాటు మరికొన్ని వివరాలు కూడా వెల్లడించారు. ఆ రోడ్డు మీద 35 కి.మీ వేగంతో వెళ్లాల్సి ఉందని తెలిపారు. యాక్సిడెంట్‌ అయినప్పుడు బండి 70-80 కి.మీ వేగంతో ఉందని తొలుత పోలీసులు చెప్పినట్లు వార్తలొచ్చాయి. ఇదంతా కాసేపు పక్కనపెడితే… యువ నిర్మాత మహేష్‌ కోనేరు కొన్ని వివరాలు ట్విటర్‌లో రాసుకొచ్చారు.

సాయితేజ్‌కు యాక్సిడెంట్‌ అయినప్పుడు సీసీ టీవీల్లో రికార్డు అయిన ఫుటేజ్‌ను షేర్‌ చేస్తూ… మహేష్‌ కోనేరు ఓ ఆసక్తికర అంశం రాసుకొచ్చారు. రోడ్డు మీద ఇసుక ఉందని, అందుకే బైక్‌ స్కిడ్‌ అయ్యిందని చెప్పిన మహేష్… అదే ఇసుక వల్ల సాయితేజ్‌ ముందు ఉన్న బైక్‌, ఆటో కూడా చిన్నపాటి స్కిడ్‌ అయినట్లు వీడియోలో కనిపిస్తోందని చెప్పారు. రోడ్డు సెంటర్‌లో ఉన్న ఆ బైక్‌, ఆటో కాస్త కుడివైపు జరగడం ఆ వీడియోలో మనం కూడా చూడొచ్చు. అయితే సాయితేజ్‌ది హెవీ బైక్‌ కావడంతో వెంటనే కంట్రోల్‌అవ్వలేదు అని మహేష్‌ కోనేరు పేర్కొన్నారు.

దీంతోపాటు ఇలాంటి భారీ బైక్‌లు అనుకోకుండా… ఇసుకపైకి వస్తే ఏం జరుగుతుందో తెలిపేలా… మోటో ఆధారిత ఆంగ్ల యూట్యూబ్‌ ఛానల్ పెట్టిన వీడియోను కూడా షేర్‌ చేశారు. ఆ వీడియో ఆధారంగా సాయితేజ్‌ది స్పీడ్‌ డ్రైవింగ్‌, ర్యాష్ డ్రైవింగ్‌ అనలేం అని కూడా అన్నారు మహేష్‌. అంతేకాదు సాయితేజ్‌ బైక్‌ వివరాలు కూడా రాసుకొచ్చారు. అందరూ అనుకుంటున్న, చెబుతున్నట్లు కాకుండా ఆ బైక్‌ 700సీసీ బైక్‌ అని చెప్పారు. అలాగే అది స్పీడ్‌ ట్రిపుల్‌ ఆర్‌ఎస్ కాదని, స్ట్రీట్‌ ట్రిపుల్‌ ఆర్‌ఎస్‌ అని చెప్పారు. అలాంటి బైక్‌ మీద 300kmph వెళ్లడం అసాధ్యం అని చెప్పారు. అలాగే వెనుక టైర్లకు బటన్‌ ఉండదు అని కొందరు చెబుతున్నారు. కానీ సాయితేజ్‌ బైక్‌ వెనుక టైర్‌కు బటన్‌ ఉంటుంది. దాని వల్ల గ్రిప్‌ కూడా బాగానే ఉంటుంది అని మహేష్‌ ట్విటర్‌లో రాసుకొచ్చారు. దాంతోపాటు సాయితేజ్‌ బైక్‌ టైర్‌ ఇలానే ఉంటుంది అంటూ ఓ ఫొటో కూడా పెట్టారు.

ఆఖరిగా… ఇలాంటి బండే కాదు, సాధారణ బండి అయినా… ఎదైనా అడ్డు వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా స్కిడ్‌ అవుతుంది. ఆ సమయంలో సాయిధరమ్‌తేజ్‌ హెల్మట్‌ పెట్టుకున్నాడు. అందుకే పెద్ద నష్టం జరగలేదు. దాంతోపాటు ఆయన, అతని కుటుంబం ప్రైవసీకి గౌరవం ఇచ్చి… మాట్లాడాలని మహేష్‌ కోనేరు సూచించారు. దాంతోపాటు ఇలాంటి యాక్సిడెంట్లు చాలామంది జరుగుతుంటాయని, వివరాలు తెలియకుండా ర్యాష్ డ్రైవింగ్‌ అని అనొద్దని మహేష్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus