ముంబయికి వెళ్లనున్న మహేష్, మురుగదాస్ బృందం
- February 10, 2017 / 08:30 AM ISTByFilmy Focus
ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో నిర్మితమవుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రం ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. తమిళ దర్శకుడు ఏ ఆర్ మురుగ దాస్ డైరక్షన్లో రూపుదిద్దుకుంటున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ జనవరి 30 వరకు హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంది. పది రోజులు బ్రేక్ ఇచ్చిన డైరక్టర్.. మరో షెడ్యూల్ ని మొదలపెట్టనున్నారు. కొత్త షెడ్యూల్ సోమవారం నుంచి ముంబయి లో జరగనుంది. దాదాపు నెల పాటు సాగే ఈ షెడ్యూల్ లో డయ్యూ, ముంబయి తదితర ప్రాంతాల్లో కీలక సీన్లు చిత్రీకరించనున్నారు. ఇందులో మహేష్ బాబు, ఉగ్రవాదులకు భీకరమైన ఫైట్ ఉంటుందని సమాచారం.
ఇంటెలిజన్స్ ఆఫీసర్ గా ప్రిన్స్ నటిస్తున్న ఈ మూవీని భారీ బడ్జెట్ తో ఠాగూర్ మధు, ప్రసాద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నెక్స్ట్ సినిమా స్టోరీ సిట్టింగ్ కోసం డైరక్టర్ కొరటాల శివ తో కలిసి మలేసియా వెళ్లిన మహేష్ రేపు హైదరాబాద్ కి రానున్నారు. ఆదివారం రాత్రి ముంబైకి పయనం కానున్నట్లు తెలిసింది. ఈ షెడ్యూల్ అయిన తర్వాత మిలిగిలిన రెండు పాటల కోసం విదేశాలకు వెళ్లనున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















