Mahesh: మహేష్ రేంజ్ ఇదే.. ఓవర్సీస్ హక్కులు ఎంతంటే?

మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అత్యంత భారీ బడ్జెట్ ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా ఓవర్సీస్ హక్కులు ఏకంగా 24 కోట్ల రూపాయలుగా ఉండనుందని తెలుస్తోంది. నిర్మాతలు ఆ రేంజ్ లో డిమాండ్ చేస్తుండగా అటూఇటుగా డీల్ ఫైనల్ కానుంది. ఈ హక్కులలో యూఎస్ రేటు మాత్రమే 16 కోట్ల రూపాయలు అని బోగట్టా. 24 కోట్ల రూపాయలకు ఈ సినిమా హక్కులు అమ్ముడైతే మాత్రం ఈ సినిమాకు 4 మిలియన్ డాలర్ల రేంజ్ లో కలెక్షన్లు రావాల్సి ఉంటుంది.

అయితే మహేష్ సినిమాకు ఆ రేంజ్ కలెక్షన్లు రావడం సులువు కాదు. పూజా హెగ్డే, శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తుండటం గమనార్హం. ఈ ఇద్దరు హీరోయిన్లకు ప్రేక్షకుల్లో ఊహించని రేంజ్ లో క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే. ఈ సినిమా 200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ ఏడాది ఆగష్టు నెల 11వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇండిపెండెన్స్ డే కానుకగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుండటం గమనార్హం.

మహేష్ ఈ సినిమా రిజల్ట్ విషయంలో పూర్తిస్థాయిలో నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమాతో మరో సక్సెస్ గ్యారంటీ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహేష్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా రికార్డ్ స్థాయిలో పెరుగుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు రెమ్యునరేషన్ ప్రస్తుతం 70 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. రాజమౌళి సినిమా నుంచి మహేష్ పారితోషికం 100 కోట్ల రూపాయల రేంజ్ కు చేరనుంది.

రాజమౌళి మహేష్ ను సరికొత్తగా చూపించనున్నారని తెలుస్తోంది. రాజమౌళి మహేష్ కాంబో మూవీ ఏ రేంజ్ రికార్డ్ లను క్రియేట్ చేయనుందో చూడాలి. త్వరలో ఈ సినిమా షూటింగ్ పనులు మొదలుకావడంతో పాటు రిలీజ్ డేట్ ను సైతం ప్రకటించనున్నారు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus