వేగంగా మహేష్, మురుగదాస్ సినిమా షూటింగ్
- January 19, 2017 / 08:01 AM ISTByFilmy Focus
సూపర్ స్టార్ మహేష్ బాబు, కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న సినిమా శర వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. గుజరాత్ ముఖ్య పట్టణం అహ్మదాబాద్ లో డిసెంబర్ 24 వరకు భారీ షెడ్యూల్ ని పూర్తి చేసిన చిత్ర బృందం నెక్స్ట్ షెడ్యూల్ ని ఈనెల ప్రారంభించింది. అన్నపూర్ణ సెవన్ ఏకర్స్ స్టూడియోలో వేసిన హైదరాబాద్ రోడ్ సెట్ లో రాత్రి వేళల్లో షూటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ షెడ్యూల్ జనవరి 29 వరకు కొనసాగుతుందని నిర్మాత ఠాగూర్ మధు తెలిపారు. ఇక్కడ షెడ్యూల్ పూర్తి అయిన వెంటనే పూణే కి పయనం కానున్నట్లు వెల్లడించారు.
అక్కడ కొన్ని సన్నివేశాలు తీయడంతో టాకీ పార్ట్ మొత్తం పూర్తి అవుతుందని, ఆ తర్వాత మిగిలిన రెండు పాటల కోసం విదేశాలకు వెళ్తామని చెప్పారు. వంద కోట్ల బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీకి “సంభవామి” అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. ఇన్వెస్ట్ గేషన్ ఆఫీసర్ గా ప్రిన్స్ నటిస్తున్న ఈ చిత్రంలో విలన్ గా తమిళ దర్శకుడు, నటుడు ఎస్.జె.సూర్య ఆకట్టుకోనున్నారు. ఇందులో ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ మహేష్ సరసన తొలిసారి ఆడిపాడనుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















