నిన్నటివరకూ ఫారిన్ లో ఫ్యామిలీతో హాలీడేస్ ఎంజాయ్ చేసిన మహేష్ బాబు ఇవాల్టి నుండి గ్యాప్ లేకుండా వర్క్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొంటున్నాడు. ప్రస్తుతం “భరత్ అనే నేను” (వర్కింగ్ టైటిల్) షూట్ లో పాల్గొంటున్న మహేష్ బాబు ఆ సినిమా అనంతరం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమాలో నటించేందుకు సైన్ చేసిన విషయం తెలిసిందే. నిజానికి మార్చిలో “మహేష్ 25” రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేయాలనుకొన్నారు. కానీ.. మహేష్ ప్లానింగ్ మారడంతో ఆ సినిమా షూటింగ్ ఫిబ్రవరి నుండే మొదలెట్టానున్నారు. జనవారిలోనే లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకోనున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనున్నారు.
ఇకపోతే.. ఈ సినిమాలో మహేష్ కు జోడీగా ఇలియానా నటించట్లేదని నిర్మాత దిల్ రాజు డిక్లేర్ చేయడంతో ముందు వినిపించినట్లుగా పూజా హెగ్డేను కథానాయికగా ఫైనల్ చేస్తారా లేక ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్నట్లుగా రకుల్ ను మరోమారు మహేష్ తో జత కట్టిస్తారా అనేది తెలియాల్సి ఉంది. అలాగే.. సంక్రాంతికి విడుదల కావాల్సిన “భరత్ అనే నేను” (వర్కింగ్ టైటిల్) షూటింగ్ కారణంగా లేట్ అవుతుండడంతో.. కొరటాల అండ్ టీం మరో మాంచి రిలీజ్ డేట్ కోసం వెతుకులాటలో ఉన్నారు.