Pawan Kalyan: పవన్ లో వచ్చిన ఈ మార్పును గమనించారా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భిన్నమనే సంగతి తెలిసిందే. జనసేన పార్టీతో పవన్ కళ్యాణ్ ఏపీలో పొలిటికల్ గా సక్సెస్ కావాలని ప్రయత్నాలు చేస్తూనే సినిమాలలో కూడా నటిస్తున్నారు. పవన్ భీమ్లా నాయక్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకుంటారేమో చూడాలి. ఈ సినిమా నుంచి మొదట రిలీజైన ట్రైలర్ పై మిక్స్డ్ రెస్పాన్స్ రాగా సెకండ్ ట్రైలర్ మాత్రం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది.

Click Here To Watch

అయితే భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ను చూసిన అభిమానులు పవన్ కళ్యాణ్ కొన్ని విషయాలలో చాలా మారారని కామెంట్లు చేస్తుండటం గమనార్హం. పవన్ కళ్యాణ్ గతేడాది రిపబ్లిక్ మూవీ ఈవెంట్ లో ఏపీలో టికెట్ రేట్ల గురించి ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. అయితే భీమ్లా నాయక్ ఈవెంట్ లో మాత్రం పవన్ టికెట్ రేట్ల గురించి ఎలాంటి కామెంట్లు చేయకపోవడం గమనార్హం.

జగన్ సర్కార్ తో తనకు ఉన్న విభేదాల గురించి మాట్లాడటానికి పవన్ అస్సలు ఇష్టపడలేదనే సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం ఈపాటికే కొత్త జీవోను అమలు చేయాల్సి ఉన్నా భీమ్లా నాయక్ వల్లే జీవో వాయిదా పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భీమ్లా నాయక్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ లుక్ కూడా మార్చారు. టక్ చేసుకుని పవన్ కళ్యాణ్ స్టైలిష్ గా, కొత్తగా కనిపించడం గమనార్హం.

పవన్ కళ్యాణ్ అభిమానులు భీమ్లా నాయక్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. టాక్ తో సంబంధం లేకుండానే భీమ్లా నాయక్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తుందని అభిమానులు భావిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.

భీమ్లా రిజల్ట్ కోసం పవన్ అభిమానులతో పాటు ఇతర హీరోల అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిరంజీవి ఇండస్ట్రీ కోసం అలా అడిగారని ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఇండస్ట్రీ విషయంలో కక్ష సాధిస్తే ఈ రంగంపై ఆధార్పడిన వాళ్లు నాశనమైపోతారని ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.

తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus