Prithviraj: షూటింగ్ లో గాయపడిన పృథ్వీరాజ్ సుకుమారన్!

మలయాళ చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఒకరు. ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన తాజాగా షూటింగ్ లొకేషన్లో ప్రమాదానికి గురయ్యారని తెలుస్తుంది. ఈ ప్రమాదంలో భాగంగా ఇతని కాలికి గాయం కావడంతో డాక్టర్లు నేడు సర్జరీ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా తమ అభిమాన నటుడు ప్రమాదానికి గురయ్యారన్న విషయం అభిమానులను కాస్త కలవరపెడుతుంది. పృధ్వీరాజ్ సుకుమారన్ విలయాత్ బుద్ధ అనే సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించి ఒక యాక్షన్ సన్ని వేశాన్ని కేఎస్ఆర్టిసి బస్సులో నిర్వహిస్తున్నారు. అయితే ఈ యాక్షన్ సన్నివేశంలో నటించే సమయంలో నటుడు పృధ్విరాజ్ కాలు జారి కింద పడటంతో తన కాలికి దెబ్బ తగిలిందని వెల్లడించారు. ఇలా కాలికి దెబ్బ తగలడంతో వెంటనే చిత్ర బృందం ఈయనని కొచ్చిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే వైద్యులు తనని పరిశీలించిన అనంతరం తన కాలికి సర్జరీ నిర్వహించాలని వెల్లడించారు.

అయితే నేడు డాక్టర్లు నటుడు (Prithviraj) పృథ్వీరాజ్ కి సర్జరీ నిర్వహించబోతున్నారని తెలుస్తుంది. అయితే ఈ సర్జరీ అనంతరం మూడు నెలల పాటు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాలని వెల్లడించారు. ఇలా తమ అభిమాన హీరోకి ప్రమాదం జరిగిందనే విషయం తెలిసి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే పృధ్వీరాజ్ సుకుమారన్ కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నటువంటి సలార్ సినిమాలో ఈయన విలన్ పాత్రలో నటించబోతున్నారు.

ఇప్పటికే ఈయన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. ఇలా వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి ఈయనకు ప్రమాదం జరగడంతో పూర్తిగా మూడు నెలల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus