సుధీర్ బాబు మొదటిసారి ట్రిపుల్ రోల్ ప్లే చేసిన మూవీ ‘మామా మశ్చీంద్ర’. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్ పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు.. లు నిర్మించిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాయి. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ ద్విభాషా చిత్రాన్ని ‘సృష్టి సెల్యులాయిడ్’ సోనాలి నారంగ్, సృష్టి సమర్పకులుగా వ్యవహరించారు. హర్షవర్ధన్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు.
అక్టోబర్ 6న ఈ సినిమా విడుదల అయ్యింది. అయితే మొదటి షోతోనే ఈ మూవీ మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకుంది. సినిమా చూసిన ప్రేక్షకులు అస్సలు బాలేదంటూ పెదవి విరిచారు. దీంతో బాక్సాఫీస్ వద్ద కూడా పెద్దగా మెరుపులు మెరిపించింది అంటూ ఏమీ లేదు. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 0.15 cr |
సీడెడ్ | 0.07 cr |
ఉత్తరాంధ్ర | 0.14 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 0.36 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ |
0.04 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 0.40 cr |
‘మామా మశ్చీంద్ర’ (Mama Mascheendra) చిత్రానికి రూ.3.38 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.3.75 కోట్ల షేర్ ను రాబట్టాలి.సినిమాకి ప్లాప్ టాక్ రావడంతో ఫుల్ రన్ ముగిసేసరికి కేవలం రూ.0.40 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. ఫైనల్ గా సుధీర్ బాబు కెరీర్లో ఇంకో డిజాస్టర్ మూవీగా మిగిలిపోయింది.
హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!