Mana ShankaraVaraprasad Garu Collections: 17వ రోజు కూడా కోటి పైనే?
- January 30, 2026 / 11:12 PM ISTByPhani Kumar
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana ShankaraVaraprasad Garu). నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా అత్యంత కీలక పాత్ర పోషించారు. ‘షైన్ స్క్రీన్స్’ ‘గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్’ సంస్థలపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించారు. టీజర్, ట్రైలర్ సాంగ్స్ వంటివి అన్నీ సినిమాకి పాజిటివ్ వైబ్స్ తీసుకొచ్చాయి.
Mana ShankaraVaraprasad Garu Collections
చిరు లుక్స్ కూడా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి.దానికి తోడు మొదటి రోజు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో మొదటి రోజు ఓపెనింగ్స్ అదిరిపోయాయి.2వ రోజు నుండి పండుగ హాలిడేస్ ను కూడా అడ్వాంటేజ్ గా తీసుకుని చాలా బాగా కలెక్ట్ చేసింది.పండుగ ముగిశాక కూడా కలెక్షన్స్ బాగున్నాయి.

ఒకసారి 17 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
| నైజాం | 44.35 cr |
| సీడెడ్ | 21.80 cr |
| ఉత్తరాంధ్ర | 18.17 cr |
| ఈస్ట్ | 14.86 cr |
| వెస్ట్ | 9.05 cr |
| గుంటూరు | 10.78 cr |
| కృష్ణా | 9.53 cr |
| నెల్లూరు | 7.04 cr |
| ఏపీ+తెలంగాణ టోటల్ | 135.58 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 12.99 cr |
| ఓవర్సీస్ | 19.07 cr |
| వరల్డ్ వైడ్ (టోటల్) | 167.64 cr |
‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రానికి రూ.120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.121 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 17 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.167.64 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.279.6 కోట్లు కొల్లగొట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.46.64 కోట్ల లాభాలు అందించింది.
దెబ్బకు డార్లింగ్ ఫ్యాన్స్ సైలెంట్.. ఓటీటీలో ఇంకెన్ని తిప్పలో















