Manchu Manoj: మనోజ్ మౌనిక వెడ్డింగ్ వీడియో చూశారా… వీడియో వైరల్!

మంచు మనోజ్ భూమా మౌనిక గత నాలుగు సంవత్సరాలుగా రిలేషన్ లో ఉంటూ ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని పెద్దలను ఒప్పించి పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. మార్చి మూడవ తేదీ ఈ దంపతులు మంచు లక్ష్మి నివాసంలో కొద్దిమంది సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.ఇలా భూమా మౌనికను పెళ్లి చేసుకున్న తర్వాత తమ ప్రేమను గెలిపించుకోవడం కోసం మనోజ్ ఎన్ని ఇబ్బందులు పడ్డారనే విషయాలను వెల్లడించారు.

ఇక పెళ్లి సమయం నుంచి (Manoj) మనోజ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తన పెళ్లిలో కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ అన్నింటిని ఒక వీడియో ఒక చిత్రీకరించి ఈయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఈ వీడియోకి ఏం మనసు అంటూ సాగిపోయే పాటను జత చేసి ఈ వీడియోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో తన పెళ్లిలో జరిగినటువంటి బెస్ట్ మూమెంట్స్ అన్నింటిని కూడా జత చేశారు. మెహందీ నుంచి మొదలుకొని హల్దీ సంగీత్ పెళ్లి కిసంబంధించిన బెస్ట్ మూమెంట్స్ ని ఈ వీడియోలో షేర్ చేశారు.ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక మనోజ్ మౌనికకు ఇది రెండవ వివాహం కావడం విశేషం. మౌనికతో తనకు 12 సంవత్సరాల నుంచి పరిచయం ఉందని నాలుగు సంవత్సరాలుగా తనతో రిలేషన్ లో ఉన్నానని తెలిపారు.

ఇక తాజాగా వీరిద్దరూ వెన్నెల కిషోర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అలా మొదలైంది కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా వీరు తమ ప్రేమను గెలిపించుకోవడం కోసం ఈ జర్నీలో ఎన్ని ఇబ్బందులను పడ్డారు ఎలా వారి ప్రేమను గెలిపించుకున్నారనే విషయాలను కూడా తెలియజేయబోతున్నట్లు తెలుస్తోంది.ఇక వ్యక్తిగత జీవితంలో స్థిరపడిన మనోజ్ తన సినిమాలపై కూడా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈయన వాటిది ఫిష్ అనే సినిమాలో నటిస్తున్నట్లు వెల్లడించారు.

 

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus