Manchu Manoj: కోవిడ్ బారిన పడ్డ మరో హీరో!

కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ కోవిడ్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో వరుసపెట్టి కోవిడ్ కేసులు వస్తున్నాయి. ఇప్పటికే కమల్ హాసన్, నటుడు అర్జున్, బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ లు కరోనా బారిన పడ్డారు. రీసెంట్ గా కోలీవుడ్ కమెడియన్ వడివేలుకి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. తాజాగా టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ కి కరోనా సోకింది.

ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ విషయంలో ఎవరినీ ఆందోళన చెందొద్దని అన్నారు. ‘నాకు క‌రోనా పాజిటివ్ అని తేలింది. ఇటీవ‌ల న‌న్ను క‌లిసిన ప్రతి ఒక్కరు వెంట‌నే క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని కోరుతున్నా. ప్రతి ఒక్కరూ కరోనా పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రస్తుతం నేను బాగానే ఉన్నా. నా గురించి ఆందోళన అక్కర్లేదు. మీ అందరి ఆశీర్వాదాలతో ఆరోగ్యంగా తిరిగివస్తా. వైద్యులు, న‌ర్సులంద‌రికీ నేను ప్రత్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నాను’ అంటూ రాసుకొచ్చారు.

Manchu Manoj gets emotional about his films1

మనోజ్ ట్వీట్ పై స్పందించిన నెటిజన్లు అతడు త్వరగా కోలుకోవాలంటూ పోస్ట్ లు పెడుతున్నారు. ఇక ఆయన కెరీర్ విషయానికొస్తే.. తన భార్యతో విడిపోయిన తరువాత మంచు మనోజ్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ‘అహం బ్రహ్మాస్మి’ అనే సినిమా అనౌన్స్ చేశారు కానీ ఇప్పటివరకు ఆ సినిమా పట్టాలెక్కలేదు. అప్పుడప్పుడు సోషల్ మీద ద్వారా అభిమానులతో మాట్లాడుతూ ఉంటారు మనోజ్.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus