మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. అయితే ఈ మధ్య మంచు విష్ణు గురించి డిస్కషన్స్ వచ్చినప్పుడు.. విష్ణు మరోసారి అధ్యక్ష పదవి కోసం పోటీ పడతారా? లేదా? అంటూ.. డిస్కషన్ నడుస్తోంది. ఇటీవల దీనిపై మంచు విష్ణు స్పందించారు. దీంతోపాటు రాజకీయాల్లోకి వెళ్లడం గురించి కూడా మాట్లాడాడు. దీంతో విష్ణు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతగ ఏమన్నాడంటే…‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో వచ్చేసారి తాను పోటీ చేసేది లేదని మంచు విష్ణు స్పష్టం చేశాడు.
కొంతమంది అనుకుంటున్నట్లు నేను మళ్లీ పోటీ చేయడం లేదు అని క్లారిటీ ఇచ్చేశాడు. అంతేకాదు మరికొంతమంది అనుకుంటున్నట్లు రెగ్యులర్ పాలిటిక్స్‌లోకి వచ్చే ఆలోచన ఏమాత్రం లేదు అని కూడా చెప్పేశాడు. ప్రస్తుతం నటుడిగా నా జీవితం చాలా బాగుందన్న మంచు విష్ణు… నటుడిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చేలా కష్టపడతాను అని చెప్పాడు. దీంతోపాటు మంచు విష్ణు మీమర్స్, నెగిటివ్ వార్తలపై కూడా విష్ణు స్పందించాడు. యూట్యూబర్లతో జరిగిన మీటింగ్‌లో ఇలా వ్యాఖ్యలు చేశాడు విష్ణు.
‘‘నాపై నెగెటివ్ మీమ్స్ వేసిన వారినీ, యూట్యూబ్‌లో నెగెటివ్ కంటెంట్ పెట్టిన వారినీ పిలిచాను. కానీ, టార్గెట్ చేసి రాసేవారిని మాత్రం వదిలిపెట్టను’’ అని వార్నింగ్ లాంటి కామెంట్ చేశాడు విష్ణు. మరి ఎంతవరకు యూట్యూబ్‌ల్లో అలాంటి కామెంట్లు, మీమ్స్ ఆగుతాయేమో చూడాలి. మంచు విష్ణు కుటుంబంలో రాజకీయ నేపథ్యం ఇప్పటికే ఉంది. మోహన్‌బాబు గతంలో రాజ్యసభ ఎంపీగా చేశారు. రాజకీయ పార్టీలతో ఆయనకు మంచి అనుబంధం కూడా ఉంది.
అయితే గత కొంతకాలంగా ఆయన ఏ పార్టీకి దగ్గరగా ఉన్నట్లు కనిపించడం లేదు. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుందని అంటున్నారు. ఇలాంటి సమయంలో విష్ణు రాజకీయ ప్రవేశంపై కామెంట్స్ వస్తుండటంతో మొత్తం కుటుంబం పొలిటికల్ ఎంట్రీ / రీఎంట్రీ అని అనుకున్నారు. కానీ విష్ణు కామెంట్స్ చూస్తుంటే ఇప్పటికిప్పుడు ఆయన పొలిటికల్ ఎంట్రీ లేనట్లు అనిపిస్తోంది.