టాలీవుడ్ నటుడు మంచు విష్ణు చాలా రోజుల తర్వాత జిన్నా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈషాన్ సూర్య దర్శకత్వంలో మంచు విష్ణు పాయల్ రాజ్ ఫుత్ , సన్నీలియోన్ నటించిన ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 21 వ తేదీ విడుదల అయ్యింది. అయితే గత సినిమాలు మాదిరిగానే ఈ సినిమా కూడా నిరాశ కలిగించిందని చెప్పాలి. ఈ సినిమా అక్టోబర్ 21వ తేదీ మొదటి షో నుంచి ఈ సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.
ఈ సినిమా కోసం 15 కోట్ల వరకు ఖర్చు చేసినప్పటికీ ఏమాత్రం వసూళ్లను రాబట్ట లేకపోయింది. ఈ సినిమాతో పాటు మరో మూడు సినిమాలు కూడా ఒకేరోజు విడుదల కావడంతో ఆ ప్రభావం జిన్నా సినిమాపై పడిందని చెప్పాలి. ఇలా ఈ సినిమా కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ సాధించలేక పోయినప్పటికీ జిన్నా సినిమా మాత్రం మంచు విష్ణుకు భారీగా లాభాలను తెచ్చిపెట్టిందని ఇండస్ట్రీ టాక్. ఈ సినిమా తెలుగులో పెద్దగా కలెక్షన్ సాధించలేకపోయిన హిందీ డబ్బింగ్ రైట్స్ మాత్రం భారీ ధరలకు అమ్ముడుపోయినట్టు తెలుస్తుంది.
ఇదివరకు మంచు విష్ణు నటించిన కొన్ని సినిమాలు హిందీలో విడుదలయి అక్కడ మంచి ఆదరణ పొందాయి. ఈ క్రమంలోనే మంచు విష్ణు నటించిన జిన్నా సినిమాని హిందీలో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ సన్నీ లియోన్ నటించడంతో ఈ సినిమాపై భారీ హైప్ ఏర్పడటం వల్ల ఈ సినిమా హిందీ రైట్స్ ఏకంగా 10 కోట్లకు అమ్ముడుపోయాయని తెలుస్తుంది.
ఈ సినిమా నిర్మించడానికి 15 కోట్ల వరకు ఖర్చకాగా,హిందీ రైట్స్ మాత్రమే 10 కోట్లు పోగా మిగిలిన నాన్ థియేట్రికల్ రైట్స్, డిజిటల్ రైట్స్, ఆడియో రైట్స్ అన్ని కలుపుకుంటే ఈ సినిమాకు భారీగా లాభాలు వచ్చాయని తెలుస్తోంది.