Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?
- June 21, 2025 / 08:22 PM ISTByPhani Kumar
మంచు విష్ణు (Manchu Vishnu) అనారోగ్యం పాలయ్యాడా? అంటే అవుననే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. ఈరోజు హైదరాబాద్లో ‘కన్నప్ప’ (Kannappa) ప్రీ రిలీజ్ వేడుకని నిర్వహించారు. ఇందులో కీలక పాత్ర పోషించిన నటుడు శివ బాలాజీ (Siva Balaji).. మంచు విష్ణు అనారోగ్యం పాలైనట్లు తెలిపి షాకిచ్చాడు.
Manchu Vishnu
అతను మాట్లాడుతూ..”ఈ రోజుల్లో సినిమా తీయడం ఈజీనే. కానీ ప్రమోషన్ కి సినిమాలో నటించిన వాళ్ళని.. గెస్ట్..లను తీసుకురావడం చాలా కష్టంగా మారింది. ఆ విషయంలో మంచు విష్ణు (Manchu Vishnu) సక్సెస్ అయ్యాడు. ‘బాహుబలి’ (Baahubali) సినిమాలో ప్రభాస్ (Prabhas) శివలింగాన్ని మోసినట్లు… ‘కన్నప్ప’ (Kannappa) అనే పెద్ద ప్రాజెక్టు భారాన్ని అలా మోశాడు మంచు విష్ణు.

నిద్ర లేకుండా ఎంతో కష్టపడి ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. ఏ టైంకి ఏ రాష్ట్రంలో ఉంటున్నాడో అంచనా వేయలేని రేంజ్లో కష్టపడ్డాడు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఒక రాష్ట్రంలో లంచ్ ఒక రాష్ట్రంలో డిన్నర్ ఇంకో రాష్ట్రంలో చేస్తూ వచ్చాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పుడు కూడా విష్ణుకి (Manchu Vishnu) చాలా జ్వరం ఉంది. అయినా సరే ఈవెంట్ కి వచ్చాడు.

అందరినీ తీసుకురావడానికి చాలా కష్టపడ్డాడు” అంటూ శివ బాలాజీ (Siva Balaji) చెప్పుకొచ్చాడు.’కన్నప్ప’ (Kannappa) సినిమాలో హీరోగా మంచు విష్ణు నటించడంతో పాటు దీనికి నిర్మాతగా కూడా వ్యవహరించాడు. దీనికి కథ అందించింది కూడా అతనే. ఈ ప్రాజెక్టు కోసం అతను 8 ఏళ్ళు కష్టపడినట్టు కూడా మోహన్ బాబు (Mohan Babu) ఓ ఈవెంట్లో తెలిపిన సంగతి తెలిసిందే. ప్రమోషన్స్ భారాన్ని కూడా అతను గట్టిగానే మోశాడు.. మోస్తున్నాడు.
3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది
సినిమా తీయడం ఈజీ.. కానీ గెస్ట్ గా సెలబ్రిటీని తీసుకురావడం కష్టం : శివ బాలాజీ
విష్ణుకి ఈరోజు ఫీవర్.. అయినా ప్రమోషన్ కి వచ్చాడు : శివ బాలాజీ
బాహుబలి లో ప్రభాస్ లింగాన్ని మోసినట్టు.. ‘కన్నప్ప’ భారాన్ని విష్ణు అలా మోశాడు#Kannappa #VishnuManchu #Prabhas #Mohanlal #MohanBabu… pic.twitter.com/QEmF2J5DBC
— Filmy Focus (@FilmyFocus) June 21, 2025














