తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మరో పండగ జరగబోతోంది. సినిమా పరిశ్రమకు 90 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా మన సినిమా కీర్తిని చాటి చెప్పేందుకు ఓ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ‘నవతిహి’ అనే పేరు పెట్టారు. మలేసియాలోని కౌలాలంపూర్ వేదికగా జులైలో ఈ వేడుకలు నిర్వహిస్తారు. సినీ పెద్దలతో చర్చించి కార్యక్రమం తేదీలను ప్రకటిస్తారు. జులైలో సినిమా చిత్రీకరణలకు మూడు రోజులు సెలవులు ఇస్తారట.
ఈ మేరకు ఆ రోజుల్లో షూటింగ్‌లు నిలిపేయాలని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు దిల్ రాజును (Dil Raju) కోరారట. దానికి ఆయన కూడా సానుకూలంగా స్పందించారట. అంతేకాదు ఈ వేడుకల ద్వారా ఫండ్ రైజ్ చేసి, ఆ మొత్తాన్ని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ‘మా’ సభ్యుల కోసం ఉపయోగించాలని నిర్ణయించారు. ఈ వేడుకలకు ఇతర చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు కూడా రానున్నారట. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన వెంటనే ‘మా’ భవనానికి సంబంధించి ప్రకటన వస్తుందని మంచు విష్ణు (Manchu Vishnu) చెప్పారు.
ఇక ‘మా’ కార్యాలయం ఎక్కడ ఉండాలనే విషయంలో జనరల్ బాడీ సమావేశంలో చర్చించామని తెలిపారాయన. ‘మా’ సభ్యులంతా కలసి కొత్త భవనం అవసరం లేదని నిర్ణయించారట. ఫిల్మ్ ఛాంబర్ కొంత కార్యాలయంలోనే ‘మా’ భవనం ఉండాలని అనుకుంటున్నామని విష్ణ చెప్పారు. ఈ విషయమై ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు తదితరులతో చర్చించామని చెప్పారు.
అలాగే ‘మా’ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది లేదని మంచు విష్ణు చెప్పారు. దీంతో ఈ విషయంలో మరో చర్చ మొదలైంది. ఆయన పోటీలో మాత్రమే దిగరా. లేక పూర్తిగా ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంటారా అనేది ప్రశ్నగా మారింది. ఆయన తరఫున తన ప్రస్తుత ప్యానల్‌లో ఎవరినైనా అధ్యక్షుడుగా బరిలో నిలుపుతారా అనేది చూడాలి.
సైలెంట్ గా పెళ్లి పీటలెక్కిన ‘బిగిల్’ నటి ఇంద్రజ..!
కర్ణాటకలో సినిమాలు బ్యాన్ అంటున్నారు… మన దగ్గరా అదే చేస్తారా?
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్