మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’లో (Kannappa) పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ రుద్రుడుగా కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తయింది, ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్ చేసినా, అతని పాత్ర మాత్రం సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందట. రామోజీ ఫిల్మ్ సిటీలో కేవలం ఐదు రోజుల్లోనే ప్రభాస్ తన పార్ట్ షూటింగ్ పూర్తి చేసేశారు.
ఈ సినిమాలో చాలా మంది స్టార్ యాక్టర్స్ ముఖ్యమైన పాత్రల్లో, గెస్ట్ రోల్స్‌లో కనిపించనున్నారు. ప్రభాస్ ‘కన్నప్ప’ సినిమాలో నటించినందుకు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. ఈ విషయాన్ని స్వయంగా మంచు విష్ణునే చెప్పారు. ప్రభాస్‌కి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా, ‘కన్నప్ప’ కోసం టైమ్ కేటాయించి, పైసా తీసుకోకుండా నటించాడని విష్ణు తెలిపారు. తన తండ్రి మోహన్ బాబు (Mohan Babu) మీద ప్రేమతో ఈ పాత్ర ఉచితంగా చేశాడని విష్ణు ఎంతో కృతజ్ఞతతో చెప్పారు.
అలాగే మోహన్ లాల్ కూడా పారితోషికం తీసుకోలేదని విష్ణు ఈ సందర్భంగా తెలియజేశారు. మిగిలిన వాళ్ళు గట్టిగానే తీసుకున్నారు అని చెప్పుకొచ్చాడు. ‘కన్నప్ప’ సినిమాలో మోహన్ బాబు, ఆర్. శరత్‌కుమార్, అర్పిత రాంకా, కౌశల్ మండ, రాహుల్ మాధవ్, దేవరాజ్, ముఖేష్ రిషి, బ్రహ్మానందం (Brahmanandam) , రఘుబాబు (Raghu Babu) వంటి నటీనటులు నటిస్తున్నారు.
అలాగే అక్షయ్ కుమార్ (Akshay Kumar), కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) శివ పార్వతులుగా కనిపిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు, మోహన్ బాబు స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రభాస్, మోహన్ లాల్ (Mohanlal) , అక్షయ్ కుమార్ వంటి స్టార్స్ వల్ల ‘కన్నప్ప’ కి మంచి బిజినెస్ జరిగే అవకాశం ఉంది.